విదేశాల్లో నీతా అంబానీ దేశీ లుక్.. కాంజీవరం బంగారు జరీ వర్క్ చీరతో అందం దిగ్విణీకృతం
అంబానీ కోడలు నీతా అంబానీ తన ఫ్యామిలీ ఫ్యాషన్ శైలిని అనుసరించినా.. ఆమె ఫ్యాషన్ ప్రత్యేకంగా ఉంటుంది. డిజైనర్ బ్రాండ్ల దుస్తులను ఎంచుకుంటారు.. దుస్తులకు మ్యాచింగ్ నగలను ధరిస్తారు. సంప్రదాయ దుస్తులలో కనిపించినా, అధునాతన దుస్తులను ధరించినా నీతా అంబానీ లుక్ ఎప్పుడూ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. ఇటీవల ఆమె లండన్‌లోని పింక్ బాల్‌లో దేశీ స్టైల్‌లో కనిపించింది. ఆమె జరీ వర్క్ దిజైనరీ చీరను , అందమైన నెక్లెస్‌ను ధరించి.. భారతీయ సంప్రదాయానికి సజీవ సాక్ష్యంగా నిల్చింది.

నీతా అంబానీ దుస్తులు, ఆభరణాలు ఎప్పుడూ వార్తల్లో నిలిస్తూనే ఉంటాయి. ఇటీవల బ్రిటిష్ మ్యూజియంలోని పింక్ బాల్ వద్ద నీతా అంబానీ ,ఆమె కుమార్తె ఇషా అంబానీ ఇద్దరూ అద్భుతమైన, అందమైన దుస్తులలో వచ్చారు. నీతా అంబానీ అందమైన చీరను ధరించింది. చీర డిజైన్ అద్భుతంగా ఉంది. ఎప్పటిలాగే ఆమె లుక్ అందరికీ నచ్చుతుంది. ఆమె మేకప్ నుంచి ఆమె ధరించిన ఆభరణాల వరకు.. ప్రతిదీ ఆమె అందాన్ని మరింత దిగ్విణీకృతం చేసింది.
బ్రిటిష్ మ్యూజియంలో జరిగిన తొలి పింక్ బాల్ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిథులు గౌన్లు , పాశ్చాత్య దుస్తులను ధరించగా.. నీతా అంబానీ విలక్షణమైన సాంప్రదాయ చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె భారతదేశంలో తయారు చేసిన అద్భుతమైన కాంజీవరం జరీ చీరను ధరించింది. ఆమె దేశీ లుక్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
చీర స్పెషాలిటీ ఏమిటంటే.. నీతా అంబానీ స్వదేశ్ బ్రాండ్ కి సంబంధించిన అందమైన పౌడర్ పింక్ కాంజీవరం చీరను ధరించారు. స్వచ్ఛమైన మల్బరీ సిల్క్, స్వచ్ఛమైన బంగారు జరీతో తయారు చేయబడిన ఈ చీరను 68 ఏళ్ల మాస్టర్ వీవర్ ఆర్. వర్దన్ చేతితో నేశారు. అతను ఈ సాంప్రదాయ కళారూపాన్ని తన తండ్రి , తాత గారి నుంచి నేర్చుకున్నాడు. తమ ఫ్యామిలీ వారసత్వంగా వచ్చిన కళను సంరక్షిస్తూ కొనసాగిస్తున్నాడు.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
View this post on Instagram
ఆమె చీరను మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఆఫ్-షోల్డర్ కార్సెట్ బ్లౌజ్‌తో జత చేసింది. ఇది నిజమైన జరీ, పురాతన ఎంబ్రాయిడరీతో ప్రత్యేకంగా రూపొందించబడింది. చీరకు మెటాలిక్ సీక్విన్ బార్డర్ జోడించబడింది. పల్లును కట్‌వర్క్ జరీతో అలంకరించారు. ఇది చీరను మరింత ఆకర్షణీయంగా చేసింది. జర్దోజీ బార్డర్ చీర ఆకర్షణను పెంచింది.
నగల డిజైన్ నగల గురించి మాట్లాడుకుంటే.. ఆమె నెక్లెస్ చాలా అందంగా కనిపిస్తుంది. దాని మధ్యలో ఒక పెద్ద పచ్చ రాయి ఉంది. వజ్రాలతో ఉన్న నెక్లెస్ కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ఉంగరం పియర్ ఆకారపు రాళ్లతో పొదిగినది. ఆమె వజ్రాల చెవిపోగులు, బ్రాస్లెట్లతో తన రాయల్ లుక్‌ను పూర్తి చేసింది. ఆమె తేలికపాటి మేకప్ , అలలుగా ఎగురుతున్న జుట్టుతో తన లుక్‌ను బ్యాలెన్స్ చేసింది.
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
నీతా అంబానీ ఫ్యాషన్ సెన్స్ కేవలం స్టైల్స్, ట్రెండ్స్ కే పరిమితం కాదు. ఆమె దుస్తులు సాంప్రదాయ భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆమె తరచుగా భారతీయ చేనేత చీరలు, బనారసి, కాంజీవరం, పటోలా ధరించి కనిపిస్తుంది. అంతర్జాతీయ వేదికపైనా లేదా ప్రపంచ వేదికపైనా, ఆమె దుస్తులు భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ఆమె లుక్ ఎల్లప్పుడూ రాజరికంగా, సొగసైనదిగా ఉంటుంది. అంతేకాకుండా ఆమె ఆభరణాల ఎంపిక కూడా అసాధారణమైనది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








