- Telugu News Photo Gallery Spiritual photos Mercury Rahu Conjunction 2026: Yukta Yoga Brings Luck to 3 Zodiac Signs!
న్యూ ఇయర్ లో బుధుడు రాహువు కలయిక.. ఈ రాశులకు గోల్డెన్ డేస్ ప్రారంభం..
త్వరలో 2025 కి గుడ్ బై చెప్పేసి.. కొత్త సంవత్సరం 2026 కి వెల్కం చెప్పడానికి రెడీ అవుతున్నారు. మరోవైపు కొత్త సంవత్సరంలో అనేక గ్రహాలు సంచారం చేయనున్నాయి. ఈ సమయంలో ఒక రాశిలో అనేక గ్రహాల కలయిక ఏర్పడనుంది. దీంతో కొన్ని శుభాయోగాలు ఏర్పడుతున్నాయి. నూతన సంవత్సరంలో బుధుడు మూడు గ్రహాల జీవితాన్ని బంగారు మయం చేయనున్నాడు. ఆ రాశులు ఏమిటంటే..
Updated on: Oct 21, 2025 | 11:11 AM

జ్యోతిషశాస్త్రంలో బుధుడిని తెలివితేటలు, కమ్యూనికేషన్, తర్కం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, వ్యాపారానికి కారకుడిగా పరిగణిస్తారు. బుధుడు కన్య రాశి, మిథున రాశి వారికి అధిపతి. ఎవరు జాతకంలోనైనా బుధుడు స్థానం బలంగా ఉంటే.. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో విజయం సాధిస్టారు. బుధుడు నిర్ణయం తీసుకునే నైపుణ్యాలను కూడా ప్రభావితం చేస్తాడు. బుధునిలో లోపం ఉంటే ఆర్థిక నష్టం, తెలివితేటలు లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధుడు ఫిబ్రవరి 3, 2026న రాత్రి 9:37 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు ఇప్పటికే ఆ రాశిలో సంచరిస్తున్నందున బుధుడు, రాహువు కలయిక వల్ల యుక్త యోగం ఏర్పడుతుంది. ఈ సంచారము ఆలోచన, వృత్తి, ఆర్థిక జీవితం , కొత్త దృక్పథాలను ప్రభావితం చేస్తుంది. కనుక బుధుని ఈ సంచారము ఏ రాశులకు శుభ ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి: ఈ రాశిలో 10వ ఇంట్లో బుధుడు-రాహువు సంయోగం దౌత్యపరమైన స్వభావాన్ని, సృజనాత్మక మనస్సును ఇస్తుంది. చేసే ప్రతి పనిలో శుభ ఫలితాలు కలుగుతాయి. దీని కారణంగా ఉద్యోగంలో శాంతి ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు, పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం ఉంది. అంతేకాదు ఆస్తి, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం కలగవచ్చు. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు, విదేశీ పరిచయాలు, కెరీర్‌లో పురోగతి ఏర్పడవచ్చు. బుధుడి తెలివితేటలు, వ్యాపారం, కమ్యూనికేషన్ కి సంబంధించిన అంశంగా పరిగణిస్తారు. రాహువుతో కలిపి బుధుడు కొన్ని రాశులకు ఊహించని ప్రయోజనాలను కలిగిస్తాడు.

ధనుస్సు రాశి: ఈ రాశికి చెందిన జాతక కుండలిలో 3వ ఇంట్లో యుక్త యోగం ఏర్పడుతుంది. 3వ ఇంట్లో బుధుడు-రాహువు కలయిక వలన వీరు చేపట్టిన ప్రతి పనిలో ప్రయోజనాలను పొందుతారు. ఈ యోగం ఇంజనీరింగ్, రైల్వేలు, రవాణా, ఎలక్ట్రీషియన్లు, కార్మికులు, పెద్ద వ్యాపారవేత్తలు, వడ్డీ వ్యాపారం, సామాజిక సేవ,రాజకీయాల వేత్తలకు చాలా ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది. ఏపని మొదలు పెట్టినా.. ఆ పనుల నుంచి ప్రయోజనాలను పొందుతారు. ప్రయత్నాలన్నీ రెట్టింపు అవుతాయి. నిరాశపరిచే జీవితంలోకి కొత్త శక్తి , కాంతి ప్రవహించే సమయం ఇది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ యోగం కూడా ఉంది. వీరు దుర్గాను పూజించడం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. అలాగే అవసరమైన వారికి అవసరమైన వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం.

మకర రాశి: యుక్త యోగం కర్కాటక రాశిలో జన్మించిన వారి జీవితంలో చాలా మంచి మార్పులను సూచిస్తుంది. ఈ సమయంలో కోరికలన్నీ నెరవేరుతాయి. డ్రైవర్లు, వ్యాపారం, బ్యాంకింగ్, ప్రభుత్వ ఉద్యోగం, పరిశ్రమ , ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే బుధుని అనుగ్రహం కారణంగా కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు వైవాహిక జీవితంలో ఆనందం, శాంతిని పొందుతారు. ఏదైనా కోర్టు లేదా ఇతర వివాదాలు ఉంటే పరిష్కరించబడతాయి. డబ్బు అప్పుగా ఇచ్చే స్థాయికి ఎదగడానికి అవకాశాలు లభిస్తాయి. గతంలో చేసిన అప్పులు తీర్చుస్టారు. వివాహం ప్రయత్నాలు చేస్తారు. పెట్టుబడుల నుంచి లాభం పొందుతారు. కర్కాటక రాశిలో జన్మించిన వారి జాతకంలో 8వ ఇంట్లో బుధుడు-రాహు సంచార సమస్యలను నివారించడానికి వాక్కుపై నియంత్రణ అవసరం.




