AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Pickle: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి వెల్లుల్లి పికిల్.. 10 నిమిషాల్లోనే తయారు చేసుకోండి ఇలా

ఈరోజు కేవలం 10 నిమిషాల్లో తయారు చేయగల గార్లిక్ పికిల్ రిసిపిని అందిస్తున్నాం. ఈ వెల్లుల్లి పచ్చడి చాలా రుచికరమైనది. ఆరోగ్యకరమైన లక్షణాలను కలిగి ఉంటుంది. 

Garlic Pickle: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి వెల్లుల్లి పికిల్.. 10 నిమిషాల్లోనే తయారు చేసుకోండి ఇలా
Garlic Pickle Recipe
Surya Kala
|

Updated on: Aug 28, 2022 | 3:48 PM

Share

Garlic Pickle Recipe: భారతీయులు భోజన ప్రియులు అన్న సంగతి తెలిసిందే. తినే ఆహార పదార్ధాలను వివిధ రకారకాల రుచులతో తినడానికి ఆసక్తిని చూపిస్తారు. కూరలు, వేపుళ్ళు, పచ్చడి వంటి రకరకాల ఆహారపదార్ధాలతో భోజనం చేస్తారు. అయితే తినే పళ్లెంలో ఎన్ని రకాల ఆహారపదార్ధాలు ఉన్నా.. ఊరగాయ ఉంటే ఆ మజానే వేరు. ఫుడ్ లవర్స్ ను పచ్చళ్ళు కట్టిపడేస్తాయి అంటే అతిశయోక్తి కాదు. మామిడి, నిమ్మ, క్యారెట్, పచ్చిమిర్చి, ఎర్ర మిరపకాయ, అల్లం, వెల్లుల్లి, ఉసిరికాయ ఇలా రకరకాల ఊరగాయలు తయారు చేస్తారు. ఇవి చక్కటి రుచిని కలిగి ఉండడమేకాదు.. ఏడాది పాటు నిల్వ కూడా ఉంటారు.

అయితే ఊరగాయలు సాధారణంగా నిల్వ ఉండడం కోసం కిణ్వ ప్రక్రియను అనుసరించి తయారు చేస్తారు. అయితే మీకోసం ఈరోజు కేవలం 10 నిమిషాల్లో తయారు చేయగల గార్లిక్ పికిల్ రిసిపిని అందిస్తున్నాం. ఈ వెల్లుల్లి పచ్చడి చాలా రుచికరమైనది. ఆరోగ్యకరమైన లక్షణాలను కలిగి ఉంటుంది.  వెల్లుల్లి ఊరగాయ ఎలా తయారు చేయాలి. ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి – 500 గ్రాముల

ఎర్ర కారం-రుచికి సరిపడా

పసుపు- చిటికెడు

మెంతిపొడి-రెండు స్పూన్లు

ఉప్పు-రుచికి సరిపడా

నిమ్మరసం-రుచికి సరిపడా

ఆవాలు -ఒక తీ స్పూన్

కరివేపాకు -రెండు రెమ్మలు

ఎండుమిర్చి – 2

నూనె- పచ్చడికి సరిపడా

వెల్లుల్లి పచ్చడి రెసిపీ:  ఒలిచిన వెల్లుల్లి నీడలో ఆరబెట్టండి. తరువాత వాటిని పెద్ద గిన్నెలోకి తీసుకోండి. అందులో ఎర్ర కారం, పసుపు, మెంతిపొడి, రుచికి సరిపడా ఉప్పు వంటి మసాలా దినుసులన్నీ వేసి కలపండి. అనంతరం ఈ మిశ్రమంలో నిమ్మకాయ రసం వేసుకోండి. తర్వాత కడాయిని స్టౌ మీద పెట్టి.. వేడి ఎక్కిన తర్వాత నూనె పోసి.. అందులో ఆవాలు వేసి వాటిని చిటపటలాడనివ్వండి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు వేసి వేయించి.. కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ నూనెను గిన్నెలో తయారు చేసుకున్న వెల్లుల్లి రెబ్బల మిశ్రమంపై పోయాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని సరిగ్గా కలపండి. అంతే 10 నిమిషాల్లో ఎంతో రుచికరమైన వెల్లుల్లి పచ్చడి రెడీ..

1. గుండెకు మంచిది: అధిక కొలెస్ట్రాల్ గుండె సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలలో ఒకటి. వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.    ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.. ఇవి రక్త ప్రసరణ సమస్యలను నివారిస్తాయి.

2. జలుబును నయం చేస్తుంది: యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది వెల్లుల్లి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీరు భోజనం చేసే సమయంలో కొద్దిగా వెల్లుల్లి ఊరగాయను జోడించడం వల్ల సీజనల్ వ్యాధులైన సాధారణ జలుబు, ఫ్లూ నుండి రక్షించుకోవచ్చు.

3. రక్తాన్ని శుద్ధి చేస్తుంది: శరీరంలో సహజ ప్రక్షాళన చేసే క్రిమిసంహారక పదార్ధం వెల్లుల్లి. వెల్లుల్లిని ఏ రూపంలోనైనా తీసుకున్నా..  రక్తం శుభ్రపడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డిసెంబర్ 31న మద్యం షాపులు ఎన్ని గంటల వరకు తెరిచి ఉంటాయో తెలుసా..?
డిసెంబర్ 31న మద్యం షాపులు ఎన్ని గంటల వరకు తెరిచి ఉంటాయో తెలుసా..?
అమ్మాయిలకు సైనేడ్ ఇచ్చి చంపే సైకో.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
అమ్మాయిలకు సైనేడ్ ఇచ్చి చంపే సైకో.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. పోలీసుల దాడుల్లో విస్తుపోయే..
హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. పోలీసుల దాడుల్లో విస్తుపోయే..
మహేష్ బాబు, ప్రభాస్ తో సినిమాలు.. హీరోయిన్ ఫస్ట్ ఆడిషన్ వీడియో..
మహేష్ బాబు, ప్రభాస్ తో సినిమాలు.. హీరోయిన్ ఫస్ట్ ఆడిషన్ వీడియో..
ఏపీలో రేపటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు. వాటి పేర్లు ఇవే..
ఏపీలో రేపటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు. వాటి పేర్లు ఇవే..
వార్నీ.. యూట్యూబ్‏లో మరో ఫోక్ సాంగ్ సెన్సేషన్..
వార్నీ.. యూట్యూబ్‏లో మరో ఫోక్ సాంగ్ సెన్సేషన్..
థైరాయిడ్ మందులు వేసుకున్నా ఫలితం లేదా? ఇవే కారణం!
థైరాయిడ్ మందులు వేసుకున్నా ఫలితం లేదా? ఇవే కారణం!
పిల్లలకు టీ, కాఫీ ఇస్తే ఏమవుతుంది..? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..
పిల్లలకు టీ, కాఫీ ఇస్తే ఏమవుతుంది..? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..
వీళ్లు బీరును ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకూడదు.. ఎందుకంటే
వీళ్లు బీరును ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకూడదు.. ఎందుకంటే
శ్రీలంక వ్యూహం..యార్కర్ల కింగ్ మలింగకు పట్టాభిషేకం
శ్రీలంక వ్యూహం..యార్కర్ల కింగ్ మలింగకు పట్టాభిషేకం