AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న్యూ ఇయర్ కిక్కే కిక్కు.. డిసెంబర్ 31న అప్పటి వరకు వైన్ షాపులు.. అక్కడ మాత్రం..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025లో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించాయి. కొత్త మద్యం పాలసీ ప్రభావంతో ఈ ఏడాది లిక్కర్ సేల్స్ ఊహించని స్థాయికి చేరుకున్నాయి. 2025 డిసెంబర్ 29 నాటికే రాష్ట్రంలో మొత్తం రూ.4,316 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి.

న్యూ ఇయర్ కిక్కే కిక్కు.. డిసెంబర్ 31న అప్పటి వరకు వైన్ షాపులు.. అక్కడ మాత్రం..
Wine Shops, Bars Timings
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Dec 30, 2025 | 8:17 PM

Share

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025లో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులు సృష్టించాయి. కొత్త మద్యం పాలసీ ప్రభావంతో ఈ ఏడాది లిక్కర్ సేల్స్ ఊహించని స్థాయికి చేరుకున్నాయి. 2025 డిసెంబర్ 29 నాటికే రాష్ట్రంలో మొత్తం రూ.4,316 కోట్ల మద్యం అమ్మకాలు నమోదయ్యాయి. గతేడాది డిసెంబర్ 31 వరకు నమోదైన అమ్మకాలు రూ.4,321 కోట్లు కాగా, ఈసారి ఇంకా రెండు రోజులు మిగిలే ఉండగానే దాదాపు అదే స్థాయికి చేరుకోవడం విశేషం. డిసెంబర్ 30, 31 తేదీల్లో మద్యం అమ్మకాలు మరింత జోరుగా సాగనున్నాయని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఈ రెండు రోజుల్లోనే రూ.600 కోట్లకు పైగా అదనపు సేల్స్ ఉండే అవకాశముందని చెబుతున్నారు. దీంతో గతేడాదితో పోలిస్తే మొత్తం అమ్మకాలు రూ.600 కోట్లకు పైగా పెరిగే అవకాశం ఉంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శివారు గ్రామ పంచాయతీల్లో జరిగిన ఎన్నికల కారణంగా కూడా మద్యం అమ్మకాలు ఓ రేంజ్ లో పెరిగాయి. ఈ కారణంగా సుమారు రూ.200 కోట్ల అదనపు ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చినట్లు సమాచారం.

అయితే.. ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల మేరకు డిసెంబర్ 31వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటాయి. బార్లు, క్లబ్బులు, టూరిజం ప్రాంతాల్లోని హోటళ్లు, అలాగే ప్రత్యేకంగా అనుమతి పొందిన ఈవెంట్ నిర్వాహకులకు రాత్రి 1 గంట వరకు పని చేయడానికి అనుమతి ఇచ్చారు.

అయితే.. కొత్త ఏడాది సంబరాలు, వెసులుబాటు వేళలు, కొత్త పాలసీ ప్రభావం.. ఈ మూడు కలిసి ఈసారి డిసెంబర్ 31ను లిక్కర్ కిక్కు డేగా మార్చబోతున్నాయ్ అంటూ పలువురు పేర్కొంటున్నారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డిసెంబర్ 31న మద్యం షాపులు ఎన్ని గంటల వరకు తెరిచి ఉంటాయో తెలుసా..?
డిసెంబర్ 31న మద్యం షాపులు ఎన్ని గంటల వరకు తెరిచి ఉంటాయో తెలుసా..?
అమ్మాయిలకు సైనేడ్ ఇచ్చి చంపే సైకో.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
అమ్మాయిలకు సైనేడ్ ఇచ్చి చంపే సైకో.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. పోలీసుల దాడుల్లో విస్తుపోయే..
హైదరాబాద్‌లో జింక మాంసం కలకలం.. పోలీసుల దాడుల్లో విస్తుపోయే..
మహేష్ బాబు, ప్రభాస్ తో సినిమాలు.. హీరోయిన్ ఫస్ట్ ఆడిషన్ వీడియో..
మహేష్ బాబు, ప్రభాస్ తో సినిమాలు.. హీరోయిన్ ఫస్ట్ ఆడిషన్ వీడియో..
ఏపీలో రేపటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు. వాటి పేర్లు ఇవే..
ఏపీలో రేపటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు. వాటి పేర్లు ఇవే..
వార్నీ.. యూట్యూబ్‏లో మరో ఫోక్ సాంగ్ సెన్సేషన్..
వార్నీ.. యూట్యూబ్‏లో మరో ఫోక్ సాంగ్ సెన్సేషన్..
థైరాయిడ్ మందులు వేసుకున్నా ఫలితం లేదా? ఇవే కారణం!
థైరాయిడ్ మందులు వేసుకున్నా ఫలితం లేదా? ఇవే కారణం!
పిల్లలకు టీ, కాఫీ ఇస్తే ఏమవుతుంది..? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..
పిల్లలకు టీ, కాఫీ ఇస్తే ఏమవుతుంది..? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే..
వీళ్లు బీరును ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకూడదు.. ఎందుకంటే
వీళ్లు బీరును ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకూడదు.. ఎందుకంటే
శ్రీలంక వ్యూహం..యార్కర్ల కింగ్ మలింగకు పట్టాభిషేకం
శ్రీలంక వ్యూహం..యార్కర్ల కింగ్ మలింగకు పట్టాభిషేకం