AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Carrot Bobbatlu: క్యారెట్లతో నేతి బొబ్బట్లు.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం!

క్యారెట్లతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. క్యారెట్‌తో స్వీట్ ఐటెమ్స్ కూడా చాలానే చేస్తారు. ఎక్కువగా క్యారెట్ హల్వా చేస్తారు. అలా కాకుండా క్యారెట్‌తో బొబ్బట్లు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లు ఎంతో రుచిగా ఉంటాయి. క్యారెట్ కూడా వేస్తాం కాబట్టి ఆరోగ్యం కూడా.. పైగా చాలా రుచిగా ఉంటాయి. నోట్లో వేస్తే కరిగిపోతాయి..

Carrot Bobbatlu: క్యారెట్లతో నేతి బొబ్బట్లు.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం!
Carrot Bobbatlu
Chinni Enni
| Edited By: |

Updated on: Dec 12, 2024 | 9:37 PM

Share

క్యారెట్లతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. క్యారెట్‌తో స్వీట్ ఐటెమ్స్ కూడా చాలానే చేస్తారు. ఎక్కువగా క్యారెట్ హల్వా చేస్తారు. అలా కాకుండా క్యారెట్‌తో బొబ్బట్లు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ బొబ్బట్లు ఎంతో రుచిగా ఉంటాయి. క్యారెట్ కూడా వేస్తాం కాబట్టి ఆరోగ్యం కూడా.. పైగా చాలా రుచిగా ఉంటాయి. నోట్లో వేస్తే కరిగిపోతాయి. క్యారెట్లతో బొబ్బట్లు చేయడం కూడా చాలా సింపుల్. ఈ బొబ్బట్లు తినడం వల్ల శరీరానికి కూడా పోషకాలు అందుతాయి. మరి ఈ బొబ్బట్లను ఎలా తయారు చేస్తారు? వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్యారెట్ బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు:

క్యారెట్లు, బియ్యం పిండి, నెయ్యి, చక్కెర లేదా బెల్లం పొడి, కోరిన కొబ్బరి.

ఇవి కూడా చదవండి

క్యారెట్ బొబ్బట్లు తయారీ విధానం:

ముందుగా క్యారెట్లను ఉడికించి మెత్తగా చేయాలి. ఇది చల్లారే లోపు.. బియ్యం పిండిలో కొద్దిగా నీరు వేసి.. పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన క్యారెట్లలో పంచదార, నెయ్యి, కొబ్బరి తురుము కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి.. అందులో క్యారెట్ మిశ్రమాన్ని ఉంచి.. మళ్లీ చపాతీని మూసేయాలి. మళ్లీ నెమ్మదిగా చేతితో లేదా రోల్‌గా బొబ్బట్టును చేయండి. ఇలా అన్నీ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే క్యారెట్ నేతి బొబ్బట్లు సిద్ధం. వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటాయి. అయితే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కేవలం అప్పటికప్పుడు మాత్రమే చేసుకుని తినాలి. వీటిని గెస్టులకు పెడితే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్యారెట్ బొబ్బట్లు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ బొబ్బట్లను చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు. బొబ్బట్లు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేస్తే చాలు.. బొబ్బట్లు సిద్ధం అవుతాయి.

Follow Us
గ్యాస్ టాబ్లెట్లు ఎక్కువగా వాడుతున్నారా? ప్రమాదంలో పడ్డట్టే?
గ్యాస్ టాబ్లెట్లు ఎక్కువగా వాడుతున్నారా? ప్రమాదంలో పడ్డట్టే?
చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..
చేపల దొంగల టవర్ ప్లాన్.. జల్సాల కోసం సినిమా రేంజ్‌లో చోరీలు..
గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్
గుడ్ న్యూస్.. త్వరలో 12 జట్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
యాంకర్ సుమ నాకు కజిన్ : నటి ఇందు ఆనంద్
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
రోజూ ఒక కిలోమీటర్ వాకింగ్ చేస్తే బాడీలో ఎంత కొవ్వు కరుగుతుందంటే?
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
నేరుగా మీ అకౌంట్లోకి రూ.10 వేలు.. కేంద్రం సూపర్ న్యూస్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఇంటర్ ఫలితాల డేట్‌ అండ్ టైం ఫిక్స్.. రిజల్ట్స్‌ వచ్చేది అప్పుడే
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
సినిమాల్లో నవ్వులు పూయించింది.. చివరకు అనాథ శవంలా..
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
హర్యానాలో గుడివాడ టెక్కీ మిస్టరీ డెత్..రక్తంతో గోడపై రాసిన రాతలు?
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..
అక్షయ తృతీయ రోజున బంగారం ఎందుకు కొంటారు.. పెద్ద కథే ఉందిగా..