Mushrooms: పుట్టగొడుగులు తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించని లాభాలు
పోషకాలు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు ఆహారంలో తీసుకుంటే జరిగే మేలు అంతా ఇంతా కాదు. డాక్టర్లు నయం చేయలేని ఎన్నో రోగాలను ఇవి ఇట్టే నివారిస్తాయి. అందువల్లనే ప్రతి ఒక్కరూ తమ డైట్ లో వీటిని చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు..
పుట్టగొడుగుల గురించి తెలియని వారుండరు. వీటి రుచి అమోఘం. పుట్ట గొడుగులను నూడుల్స్, శాండ్‌విచ్‌లు, ఫ్రైడ్ రైస్ వంటి వివిధ రకాల ఆహారాలల్లో ఉపయోగిస్తారు. పుట్టగొడుగులు ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అందుకే నిపుణులు దీన్ని పోషకాల పవర్‌హౌస్ అంటారు. మీ రోజువారీ ఆహారంలో పుట్టగొడుగులను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
సమృద్ధిగా పోషకాలు
పుట్టగొడుగులలో అవసరమైన విటమిన్లు, విటమిన్ డి, బి-విటమిన్లు, సెలీనియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
పుట్టగొడుగులలో బీటా-గ్లూకాన్స్, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే ఇతర సమ్మేళనాలు ఉంటాయి. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల శరీరం వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని పుంజుకుంటుంది.
మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది
పుట్టగొడుగులలోని ఎర్గోథియోనిన్, యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. మతిమరుపును కూడా తగ్గిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు అధికం
పుట్టగొడుగులలో ఎర్గోథియోనిన్, గ్లూటాతియోన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా రక్షిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
గుండెకు మేలు
పుట్టగొడుగులలో కొలెస్ట్రాల్ ఉండదు. సోడియం తక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఇందులోని పొటాషియం కంటెంట్ బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను హెల్దీగా మెయింటైన్ చేయడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పేగు ఆరోగ్యానికి
పుట్టగొడుగుల్లో ప్రీబయోటిక్స్ ఉంటాయి. ఇది మానవ శరీరంలోని మంచి బ్యాక్టీరియాకు పోషణనిస్తుంది. ఇది జీర్ణక్రియ, మొత్తం గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. వీటన్నింటికీ అదనంగా, పుట్టగొడుగులు శాఖాహార ఆహారాలకు అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. వీటిల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అందువల్లనే వీటిని రెగ్యులర్ గా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.