AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hair Care Tips: జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలనుకుంటున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి..

ప్రస్తుత కాలంలో జుట్టు ఊడిపోవడం అనే సమస్యతో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు. దీని కారణం మారిన జీవనశైలి, పెరిగిన ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం, రసాయన షాంపూల వాడకం వంటి అనేక సమస్యలు. జుట్టు పెరుగుదల కోసం మంచి నూనె, షాంపూ, కండీషనర్‌తో పాటు మంది ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం. జుట్టు పెరుగుదల కోసం ఈ ఆహారాలలో కొన్నింటిని తీసుకోవడం చాలా అవసరం. కనుక జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరగడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకోండి..

Hair Care Tips: జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలనుకుంటున్నారా.. తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి..
Hair Care Food
Surya Kala
|

Updated on: Dec 13, 2024 | 8:43 PM

Share

ఏం చేసినా జుట్టు రాలడం ఆగడం లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు. అంతేకాదు చాలా మంది తమ జుట్టును కాపాడుకోవడానికి డబ్బు ఖర్చు చేసి ఖరీదైన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఇది ఆ క్షణానికి మాత్రమే ఉపశమనం కలిగించగలదు. అయితే జుట్టు బాగా పెరగాలంటే తినే ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. జుట్టు పోషణ అందించే పొడవైన జుట్టు కోసం కొన్ని రకాల ఆహారాలను తినాలని నిపుణులు చెబుతున్నారు.

పాలకూర: పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, సి, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఐరన్ హెయిర్ ఫోలికల్స్‌కు ఆక్సిజన్‌ను అందించడంలో సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

గుడ్లు: గుడ్లలో ప్రోటీన్, బయోటిన్, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ప్రొటీన్ జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

చేపలు: సాల్మన్ చేపలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, విటమిన్ డి , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు వెంట్రుకల కుదుళ్లకు పోషణను అందించి, శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీంతో జుట్టు ఒత్తుగా, ఒత్తుగా పెరుగుతుంది.

శనగలు: శనగలు, బఠానీలు, బీన్స్‌తో సహా ఇతర గింజలు జింక్, ప్రోటీన్, ఫైబర్‌లో పుష్కలంగా ఉన్నాయి. వీటిని తినడం వలన జుట్టు ఒత్తుగా పెరగడమే కాదు ఆరోగ్యవంతమైన జుట్టును కూడా అందిస్తుంది. వీటిని సూప్‌లు, సలాడ్‌లు, సైడ్ డిష్‌గా తీసుకోవచ్చు.

పొద్దుతిరుగుడు గింజలు: గింజల వినియోగం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. జుట్టు పెరుగుదలలో కూడా ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందువల్ల బాదం లేదా పొద్దుతిరుగుడు గింజలు బయోటిన్, ఇతర B విటమిన్లను కలిగి ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

చిలగడదుంప: చిలగడదుంపలో విటమిన్ బి, పొటాషియం, విటమిన్ సి, జింక్ వంటి జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు ఉన్నాయి. ఈ చిలగడదుంపలు జుట్టులో పోషకాల లోపాన్ని పోగొట్టి, వెంట్రుకలు వేగంగా పెరిగేలా చేస్తాయి.

క్యారెట్: క్యారెట్‌లో విటమిన్లు, ఫైబర్, పొటాషియం, ఐరన్, జింక్, ఫాస్పరస్, బీటా కెరోటిన్ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. క్యారెట్‌లోని విటమిన్ ఏ స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఇందులోని విటమిన్లు రక్త ప్రసరణను పెంచుతాయి. బయోటిన్ , విటమిన్ ఎ కెరాటిన్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం..
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!