జీవితంలో సంక్షోభం నుంచి ఉపశమనం కోసం సంకటహర చతుర్ధి రోజున గణపతిని ఇలా పూజించండి..

2024వ సంవత్సరం చివరి సంకష్ట చతుర్థి రోజున గణపతి అనుగ్రహం పొందడానికి ఆచారాల ప్రకారం వినాయకుడిని పూజించండి. శుభముహూర్తంలో పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు లభిస్తాయని వినాయకుడి అనుగ్రహం వల్ల ప్రజల కష్టాలన్నీ దూరమవుతాయని నమ్మకం.

జీవితంలో సంక్షోభం నుంచి ఉపశమనం కోసం సంకటహర చతుర్ధి రోజున గణపతిని ఇలా పూజించండి..
Sankatahara Chaturthi
Follow us
Surya Kala

|

Updated on: Dec 13, 2024 | 7:30 PM

సంకటహర చతుర్థి అనేది హిందూ మతంలో గణేశుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ. ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిధిని సంకటహర చతుర్థిగా జరుపుకుంటారు. ‘సంకటహర’ అంటే ‘సంక్షోభం’ అని, ‘చతుర్థి’ అంటే ‘నాల్గవ రోజు’ అని అర్థం. ఈ రోజున వినాయకుడిని పూజించడం వలన అన్ని రకాల కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

మార్గశిర మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథిని అఖూర్త సంకష్ట చతుర్థి అంటారు. దీనిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున గణేశుడిని పూజించడం , ఉపవాసం ఉండటం వల్ల ప్రజలు వ్యాపారంలో విజయం సాధిస్తారని నమ్ముతారు. అంతేకాకుండా ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. పనిలో వచ్చే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అఖూర్త సంకటహర చతుర్థి రోజున గణపతిని ఎలా పూజించాలి తెలుసుకుందాం..

పంచాంగం ప్రకారం మార్గశిర మాసం కృష్ణ పక్ష చతుర్థి తిథి డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10.06 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే డిసెంబర్ 19వ తేదీ ఉదయం 10.02 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ ఏడాది అఖూర్త సంకటహర చతుర్థి ని డిసెంబర్ 18 న జరుపుకుంటారు., ఎందుకంటే సంకటహర చతుర్థి రోజున సాయంత్రం గణపతిని పూజిస్తారు. దీని తర్వాత ఉపవాసం విరమిస్తారు.

ఇవి కూడా చదవండి
  1. బ్రహ్మ ముహూర్తం – ఉదయం 05:19 నుంచి 06:04 వరకు ఉంటుంది.
  2. విజయ ముహూర్తం – మధ్యాహ్నం 02:01 నుంచి 02:42 వరకు ఉంటుంది.
  3. సంధ్య ముహూర్తం – సాయంత్రం 05:25 నుంచి 05:52 వరకు ఉంటుంది.
  4. అమృత కాలం – ఉదయం 06:30 నుంచి 08:07 వరకు ఉంటుంది.

సంకటహర చతుర్థి పూజా విధానం

  1. సంకష్ట చతుర్థి రోజున తెల్లవారుజామున నిద్రలేచి గణేశుడిని ధ్యానించాలి.
  2. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.
  3. ఇంటిని శుభ్రం చేసిన తర్వాత గంగాజలం చల్లి శుద్ధి చేయండి.
  4. గణేశుడు , శివపార్వతుల విగ్రహాలను పీఠంపై ఏర్పాటు చేసుకోవాలి
  5. గణేశుడి నుదుటిపై తిలకం దిద్ది పువ్వుల మాల సమర్పించండి.
  6. ఇప్పుడు ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసి దేశీ నెయ్యి దీపం వెలిగించి గణేశుడి పూజ మొదలు పెట్టండి.
  7. పూర్తి ఆచారాలతో గణపతి బప్పాకు హారతి ఇవ్వండి, మోదకం, పండ్లు సమర్పించండి.
  8. జీవితంలోని అడ్డంకులను తొలగించమని కొరుకొంది. ప్రజలకు ప్రసాదం పంచి పెట్టండి.

ఈ గణేశ మంత్రాలను పఠించండి

  1. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమ్ప్రభ । నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా
  2. ఓం శ్రీం గం సౌమ్యాయ గణపతయే వర వరద్ సర్వజనం మే వష్మానాయ స్వాహా.

సంకటహర చతుర్థి ప్రాముఖ్యత

సంకటహర చతుర్థి సందర్భంగా గణేశుడిని నియమ నిష్టలతో పూజించడం ద్వారా అన్ని రకాల ఆటంకాలు తొలగిపోయి చేపట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. సంకటహర చతుర్థి రోజున గణేశుని కోరిన కోరికలు నెరవేరుతాయి. గణేశుడు మేధస్సుకు అదిదేవుడు. ఆయనను ఆరాధించడం వల్ల తెలివితేటలు వృద్ధి చెందుతాయి. జ్ఞానం పెరుగుతుంది. ఈ రోజున గణేశుడిని పూజించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుంది. ఇంటి నుంచి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సానుకూల శక్తిని నింపుతుంది.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.