Maha Kumbh Mela: మహా కుంభమేళా కోసం 350 షటిల్ బస్సులు రెడీ.. ఉచిత ప్రయాణ సౌకర్యం ఏఏ రోజుల్లో అంటే..

కొత్త సంవత్సరం ప్రారంభంలోనే గొప్ప వేడుక జరగనుంది. జనవరి 13వ తేదీ 2025న ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాను నిర్వహించనున్నారు. ఈ జాతరను అంగరంగ వైభవంగా జరపడానికి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పట్లుచేస్తోంది. తాజాగా 350 షటిల్ బస్సుల సేవలను ప్రారంభించనున్నారు. అంతేకాదు వ్యవస్థను మెరుగుపరచడానికి 22 మంది అధికారులతో కూడిన బృందాన్ని నియమించనున్నారు. ప్రధాన స్నానోత్సవాల సమయంలో షటిల్ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది.

Maha Kumbh Mela: మహా కుంభమేళా కోసం 350 షటిల్ బస్సులు రెడీ.. ఉచిత ప్రయాణ సౌకర్యం ఏఏ రోజుల్లో అంటే..
Maha Kumbh Mela 2025
Follow us
Surya Kala

|

Updated on: Dec 14, 2024 | 2:59 PM

13 జనవరి 2025 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభ మేళా కోసం ప్రయగ్ రాజ్ అందంగా ముస్తాబవుతోంది. మరోవైపు స్నానం చేయడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నారు. భక్తుల కోసం ప్రయాగ్‌రాజ్ ప్రాంతంలో 350 షటిల్ బస్సుల సేవలను రవాణా సంస్థ ప్రారంభించనుంది. అంతేకాదు వారణాసి రోడ్‌వేస్ 50 ప్రత్యేక కుంభ్ షటిల్ బస్సులను కూడా సిద్ధం చేసింది. ఇవి కుంకుమ రంగులో ఉంటాయి. ప్రయాణీకులను త్రివేణీ సంగమానికి చేరవేస్తాయి. ఈ బస్సు రవాణ సదుపాయం అందరికి అందాలనే ఉద్దేశ్యంతో.. వ్యవస్థ సజావుగా సాగేందుకు 22 మంది అధికారులతో కూడిన బృందాన్ని ప్రభుత్వం నియమించింది. మొరాదాబాద్‌కు చెందిన అనురాగ్ యాదవ్‌ను సర్వీస్ మేనేజర్‌గా ఇన్‌ఛార్జ్‌గా నియమించారు.

ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ఏడు మార్గాల్లో క్విక్ రెస్పాన్స్ టీమ్‌ను మోహరిస్తామని.. ఇది అత్యవసర పరిస్థితుల్లో సహాయపడుతుందని రవాణా మంత్రి దయాశంకర్ సింగ్ తెలిపారు. ఈ బృందాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, రవాణా సంస్థ సాంకేతిక సిబ్బంది ఉంటారు. వీరు బస్సులలో సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తారు.

ఏ విధంగా బస్సులు నడపనున్నారంటే

జాతరలో మొదటి దశలో 2000 బస్సులు, రెండో దశలో 6800 ఆర్డినరీ, 200 ఏసీ బస్సులు కలిపి 7000 బస్సులు ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన స్నానోత్సవాల సమయంలో షటిల్ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. అంతేకాదు 200 సిటీ ఎలక్ట్రిక్ బస్సులు కూడా షటిల్ సర్వీసులో ఉంటాయి.

24 గంటల టోల్ ఫ్రీ, వాట్సాప్ నంబర్ అందుబాటులో..

ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ వేగంగా సన్నాహాలు చేస్తోందని, ఫెయిర్ ఆఫీసర్ గౌరవ్ వర్మను నియమించామని ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఎండీ మసూమ్ అలీ సర్వర్ తెలిపారు. మొబైల్ డీజిల్ డిస్పెన్సింగ్ యూనిట్లు, 24 గంటల టోల్ ఫ్రీ నంబర్ (1800 1802 877), వాట్సాప్ నంబర్ (94150 49606) కూడా తాత్కాలిక బస్ స్టేషన్లలో అందుబాటులో ఉంటాయి.

వారణాసి నుంచి నడవనున్న 320 బస్సులు

కాశీ నుంచి 320 బస్సులు నడవనున్నాయని ఇందులో 5 జనరల్ బస్సులు కూడా ఉంటాయని వారణాసి రోడ్‌వేస్ రీజనల్ మేనేజర్ తెలిపారు. కుంభ సేవ కోసం ప్రత్యేకంగా 50 షటిల్ బస్సులను సిద్ధం చేశారు.. ఈ బస్సులు కుంకుమ రంగులో ఉండనున్నాయి. ఈ బస్సుల్లో డ్రైవర్లు, కండక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతోపాటు ఉద్యోగులందరినీ యూనిఫాంలో ఉండనున్నారు.

మూడు దశల్లో బస్సుల నిర్వహణ

మూడు దశల్లో బస్సులు నడపనున్నారు. జనవరి 12 నుంచి 23 వరకు మొదటి దశ, జనవరి 24 నుంచి ఫిబ్రవరి 7 వరకు రెండో దశ, ఫిబ్రవరి 8 నుంచి 27 వరకు మూడో దశ బస్సులు నడపనున్నారు. మొదటి, మూడవ దశలో 10 ప్రాంతాల నుంచి 3050 బస్సులు ప్రయాగ్‌రాజ్ నుంచి నడపనున్నారు. రెండవ దశలో 7000 బస్సులను మౌని అమావాస్య, వసంత పంచమి స్నాన సందర్భంగా నడపనున్నామని అధికారులు చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒక రాత్రిలో వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఏఐ చేసిన అద్భుతమిదే..!
ఒక రాత్రిలో వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఏఐ చేసిన అద్భుతమిదే..!
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
మెట్రో రైలులో జుట్లు పట్టుకున్న యువతులు.. దేనికోసమో తెలుసా ??
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్‌‌కు బిగ్ షాక్.. లిక్కర్ కేసులో..
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
పండగ పూట విషాదం.. గాలిపటం ఎగురవేస్తూ భవనంపై నుంచిపడి వ్యక్తి మృతి
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
బీర్ల ప్రియులకు షాక్‌.. కింగ్‌ఫిషర్‌ షాకింగ్‌ డెసిషన్‌
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ప్రపంచ 25 బ్యాంకుల జాబితాలో భారతీయ బ్యాంకులు!
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
ఇది తిన్నారంటే ఇట్టే బరువు తగ్గుతుంది.. కీరాతో కిరాక్ లాభాలు..  
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
యూజీసీ నెట్ 2024 పరీక్ష తేదీలు మారాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?
ఈ బడ్జెట్‌లో ఇవి చౌకగా మారుతాయా..? మంత్రి నిర్మలమ్మ ప్లాన్‌ ఏంటి?
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..
గంగిరెద్దు కొమ్ములకు UPI స్కానర్.. చిల్లర లేదని తప్పించుకోలేరు..