Somavati Amavasya: జీవితంలో సుఖశాంతుల కోసం సోమవతి అమావాస్య రోజున చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే..
సోమవతి అమావాస్య ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకమైన రోజు. ఈ రోజున మహిళలు ఆది దంపతులైన శివ పార్వతులను పూజిస్తారు. ఈ రోజున తీసుకున్న చర్యలు జీవితంలో సుఖ సంతోషాలను తెస్తాయని, అన్ని రకాల కష్టాలను తొలగిస్తాయని నమ్మకం.
సోమవతి అమావాస్య హిందూ మతంలో ఒక ప్రత్యేకమైన రోజు. సోమవారం అమావాస్య తిధి వస్తే.. ఆ రోజుని సోమవతి అమావాస్య అని అంటారు. ఈ రోజు శివపార్వతికి అంకితం చేయబడింది. ఈ రోజున శివపార్వతులను పూజించడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయని, జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం. ఈ రోజున శివ పార్వతులను ఆరాధించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయని.. ఈ రోజు పూర్వీకులను తలచుకుని ప్రార్దించడం వలన ఆశీర్వాదం లభిస్తుందని .. కనుక ఈ రోజు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున చేసే పూజల వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. సోమవతి అమావాస్య రోజున చేసే చర్యల వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ రోజున చేసే పూజలు ఇంట్లో సుఖ సంతోషాలను, శ్రేయస్సును కలిగిస్తాయి.
పంచాంగం ప్రకారం మార్గశిర మాసం కృష్ణ పక్షంలోని అమావాస్య తిథి డిసెంబర్ 30 ఉదయం 4:01 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు డిసెంబర్ 31 తెల్లవారుజామున 3:56 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం సోమవతి అమావాస్య డిసెంబర్ 30 న మాత్రమే జరుపుకోవాలి.
సోమవతి అమావాస్య రోజున చేయాల్సిన పరిహారాలు
- సోమవతి అమావాస్య రోజున శివలింగానికి నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి మొదలైన వాటితో అభిషేకం చేయండి.
- సోమవతి అమావాస్య నాడు ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి.
- ‘ఓం నమః శివాయ’ అనే మంత్రాన్ని జపించండి.
- పేదలకు , ఆకలి అన్నవారికి దానం చేయండి.
- రావి చెట్టుకు నీరు సమర్పించి దీపం వెలిగించండి.
- పూర్వీకులకు తర్పణం సమర్పించడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది.
- పార్వతీదేవిని ఆరాధించడం వల్ల సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి.
ఈ మంత్రాలను జపించండి
ఓం త్ర్యంబకం యజామహే సుగన్ధి పుష్టివర్ధనమ్ । ఉర్వారుకమివ్ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మమృతాత్ । ఓం నమః శివాయ
కర్పూర్ గౌరం కరుణావతారం సంసారసారం భుజగేన్ద్రహారమ్ । సదా వసంతం హృదయారవిందే భవం భవానీసహితం నమామి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్
ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి
సోమవతి అమావాస్య రోజున ఉపవాసం ఉంటే.. దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. శివపురాణం పఠించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సోమవతి అమావాస్య రోజున శివాలయాన్ని సందర్శించండి. అయితే ఈ రోజున నల్లని వస్త్రాలు ధరించకూడదని, మాంసం , మద్యం సేవించకూడదని గుర్తుంచుకోండి. అంతేకాదు ఈ రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకండి. రోజున కోపం తెచ్చుకోకండి. కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోండి. ఈ చర్యలను అనుసరించడం ద్వారా జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును తీసుకురావచ్చు. అన్ని రకాల ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.