AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న చిలుక.. జలుబు చేసిందని యజమానికి చెబుతున్న వీడియో వైరల్

రామ చిలుకని ఎక్కువ మంది పెంచుకోవడానికి ఇష్టపడతారు. అందంగా ఉండడమే కాదు మనిషిలా మాట్లాడుతూ సందడి చేస్తుంది. తాజాగా రామ చిలుకకు సంబందించిన ఓ ఫన్నీ వీడియో @cosmothefunnyparrot అనే ఖాతాలో Instagramలో షేర్ చేశారు. చిలుక తనకు విపరీతమైన జలుబు అని తన యజమానురాలికి వివరించేందుకు ప్రయత్నించడం.. అది చెప్పే విధానం ఆసక్తికరంగా ఉన్నట్లు వీడియోను చూడడం ద్వారా తెలుస్తోంది.

Viral Video: అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్న చిలుక.. జలుబు చేసిందని యజమానికి చెబుతున్న వీడియో వైరల్
Viral Video
Surya Kala
|

Updated on: Dec 13, 2024 | 8:24 PM

Share

ఆఫ్రికన్ గ్రే చిలుకకి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఈ గ్రే చిలుక అందంగా ఉండడమే కాదు.. అది మాట్లాడే తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ఈ వీడియోలో ఆఫ్రికన్ చిలుక అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడే విధానం విన్నవారిని ఆకట్టుకుంటుంది. చిలుక మాటలు వింటే మనసు కూడా ఉప్పొంగుతుంది. చిలుక తనకు జలుబు చేసిందని తన యజమానురాలికి ఇంగ్లీషులో చెప్పడానికి ప్రయత్నించిందని తెలుస్తోంది. అందుకోసం వృద్ధుడు మాట్లాడుతున్నట్లుగా దగ్గుతూ తుమ్ముతూ వివరించే ప్రయత్నం చేస్తోందని వీడియోలో చూపించారు.

వైరల్ అవుతున్న వీడియోలో చిలుక జలుబుతో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తూ.. తన యజమానురాలుతో ‘అమ్మా, నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను’ అని చెప్పడం మీరు చూస్తారు. దీని తర్వాత యజమానురాలు చిలుకతో, ‘నీకు అనారోగ్యంగా ఉందని నేను అనుకోను’ అని చెప్పింది. దీనిపై చిలుక జలుబు బారిన పడినట్లు నటిస్తూ మళ్లీ ‘అయ్యో నాకు అనారోగ్యంగా ఉంది’ అంటుంది. తన ముక్కును చీదడం మొదలు పెట్టింది. చిలుక, స్త్రీ మధ్య ఆంగ్లంలో జరిగిన ఈ సంభాషణను చూస్తే ఎవరి ముఖంలోనైనా చిరునవ్వు వస్తుంది. పెంపుడు జంతువుల ప్రేమికులకు ఈ వీడియో ఒక ట్రీట్ వంటిందే..

చక్కగా ఇంగ్లీష్ మాట్లాడే చిలుక వీడియోను ఇక్కడ చూడండి

చిలుకకి సంబంధించిన అందమైన ఫన్నీ వీడియో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయబడింది. నవంబర్ 27న అప్‌లోడ్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు 27 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేయగా.. కామెంట్ బాక్స్ ఫన్నీ కామెంట్లతో నిండిపోయింది.

ఓ భైసాబ్.. చిలుక నటనకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని ఒక వినియోగదారు వ్యాఖ్యానించారు. దీనికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఇంకో యూజర్ అంటున్నాడు. రామ చిలుకకు జలుబు చేసింది.. దీనిని దాని తల్లి ఈ విషయాన్నీ అంగీకరించడానికి సిద్ధంగా లేదని కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..