Last Road Of The World: ప్రపంచంలోని చివరి రహదారి.. ఒంటరిగా ప్రయనించడంపై నిషేధం.. కారణం తెలిస్తే షాక్

ఓ దేశంలోని రోడ్డుపై ఒంటరిగా ప్రయాణించడం నిషేధం. ప్రమాదకరమైన వాతావరణం, భౌగోళిక స్థానం కారణంగా ఒంటరిగా ఆ రోడ్డుమీద ప్రయాణించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. 129 కి.మీ పొడవైన రహదారి నార్వే లో ఉంది. ఇది E69 హైవే .. దీనిని ప్రపంచం చివరి రహదారిగా పిలుస్తారు. దీనికి కారణం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఉత్తర ధ్రువానికి దగ్గరగా ఉన్న ఈ రహదారి శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటే వేసవిలో భారీ వర్షాలు కురుస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ రహదారిపై ప్రయాణించే విషయంలో నిషేధాజ్ఞలు ఉన్నాయి.

Last Road Of The World: ప్రపంచంలోని చివరి రహదారి.. ఒంటరిగా ప్రయనించడంపై నిషేధం.. కారణం తెలిస్తే షాక్
Norway E69 Highway
Follow us
Surya Kala

|

Updated on: Dec 13, 2024 | 8:02 PM

ఒంటరిగా ప్రయాణించాలంటే భయపడే రహదారి ఒకటి ఉందని మీకు తెలుసా.. ఈ రహదారిపై ఎవరూ ఒంటరిగా వెళ్లడానికి అనుమతించరు. ఇలాంటి రోడ్డు ప్రపంచంలో ఒకటే ఉంది. అది నార్వేలోని E-69 రహదారి. ఇది ప్రపంచంలోని చివరి రహదారిగా పరిగణించబడుతుంది. ఈ రహదారి పశ్చిమ ఐరోపాకు ఉత్తరాన ఉంది. దీని పొడవు 129 కిలోమీటర్లు. ఈ రహదారి ఐరోపాలోని చివరి బిందువు అయిన నార్త్ కేప్‌కు దారి తీస్తుంది. ఇక్కడ వాతావరణం చాలా అనూహ్యంగా మారుతుంది. అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. కనుక ఈ రహదారిపై ఒంటరిగా ప్రయాణించడం నిషేధించబడింది. ఈ రోడ్డు ప్రత్యేకత ఏంటంటే..ఈ రహదారి ఉత్తర ధ్రువానికి చాలా దగ్గరగా ఉంటుంది. శీతాకాలంలో ఇది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. కనుక ప్రయాణం కొంచెం కష్టంగా ఉంటుంది.

ఈ దారిలో నడుస్తుంటే చుట్టూ మంచుతో పాటు సముద్రం ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండే దృశ్యాన్ని చూడవచ్చు. వేసవిలో భారీ వర్షాలు కురుస్తాయి. శీతాకాలంలో మంచు కురుస్తుంది. ఈ రహదారిని 1999 జూన్‌లో నిర్మించారు. ఇక్కడికి చేరుకోవాలంటే ముందుగా పడవ సాయం తీసుకోవాలి. నార్వేలో 6 నెలలు సూర్యుడు ఉదయించడు. కనుక 6 నెలలు చీకటిగా ఉంటుంది. మిగిలిన 6 నెలలు సూర్యుడు కనిపిస్తాడు.

ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం కావడంతో పాటు వాతావరణంలో వేగంగా వచ్చే మార్పుల కారణంగా ఈ రోడ్డులో ఒంటరిగా వెళ్లడం నిషేధమని.. ఈ రోడ్డులో ప్రయాణించాలనుకుంటే ముగ్గురు లేదా నలుగురు ఇలా కొంత మంది కలిసి బృందంగా వెళ్ళాలని అధికారులు సూచిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..