నెలకు రూ.80,000 ఆదాయం.. ఇది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీతం కాదు

నెలకు రూ.80,000 ఆదాయం.. ఇది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీతం కాదు

Phani CH

|

Updated on: Dec 12, 2024 | 9:03 PM

నెలకు రూ.85,000 వరకు ఆదాయం.. ఇదేదో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీతం కాదు.. ఇది ఓ బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌ సంపాదన! అవునండి.. దాదాపు రోజుకు 13 గంటల పాటు విభిన్న ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి బెంగళూరులోని ఓ బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌ సంపాదిస్తున్న మొత్తం అది. తన సంపాదనకు సంబంధించిన వివరాలను వెల్లడించిన ఓ వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

బైక్ ట్యాక్సీలు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజాదరణ పొందాయి. చాలామంది డ్రైవర్లకు, స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ఉబర్‌, రాపిడో, ఓలా.. వంటి కంపెనీలు ప్రస్తుతం ఈ సేవలు అందిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ఓ బైక్ ట్యాక్సీ డ్రైవర్ , ఉబర్‌, రాపిడోలో వచ్చిన రైడ్‌లను పూర్తి చేస్తూ, రోజుకు 13 గంటల పాటు పనిచేస్తూ నెలకు రూ.80,000-రూ.85,000 వరకు సంపాదిస్తున్నాడు. సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేసిన వీడియో చూసినవారు బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌గా ఉంటూ అంతమొత్తంలో ఆర్జించడం పట్ల ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ మీద బల్లి అక్కడ పడిందా.. వద్దన్నా డబ్బులేనట !!

సత్యసాయి ట్రస్ట్ మొక్కలు నాటుతుంటే.. కరెంటోళ్లు చెట్లు నరికేస్తున్నారు

క్యాన్సర్‌ను కూడా తరిమికొట్టే అద్భుతమైన పండు ఇదే !!

42 గంటల్లో గమ్యం చేరాల్సిన రైలు.. మూడున్నరేళ్లకు చేరింది

అరుదైన పాము ప్రత్యక్షం.. తక్షక వంశానికి చెందిన నాగుగా నిర్ధారణ