42 గంటల్లో గమ్యం చేరాల్సిన రైలు.. మూడున్నరేళ్లకు చేరింది

42 గంటల్లో గమ్యం చేరాల్సిన రైలు.. మూడున్నరేళ్లకు చేరింది

Phani CH

|

Updated on: Dec 12, 2024 | 8:40 PM

సాధారణంగా ఓ రైలు పది లేదా పదిహేను నిమిషాలు ఆలస్యమవుతుంది. మరీ ఆలస్యం అనుకుంటే రెండు మూడు గంటలు లేటవుతుంది. కానీ 42 గంటల్లో చేరాల్సిన ఓ రైలు.. సరిగ్గా 3 సంవత్సరాలకు గమ్యం చేరుకుంది. భారతీయ రైల్వే చరిత్రలో ఇది అత్యంత ఆలస్యమైన రైలుగా రికార్డు సృష్టించింది.

2014వ సంవత్సరం నవంబర్‌లో విశాఖపట్నం నుంచి బయల్దేరిన ఈ రైలు ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ స్టేషన్‌కి చేరుకోవడానికి మూడున్నరేళ్లు పట్టింది. మామూలుగా అయితే ఈ రైలు 1,400 కిలోమీటర్ల దూరం చేరడానికి కేవలం 42 గంటల 13 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఈ రైలు గమ్యం చేరడానికి ఏకంగా మూడున్నరేల్లు పట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 2014లో రామచంద్ర గుప్తా అనే వ్యాపారవేత్త 14 లక్షల విలువైన 1,361 ఎరువుల బస్తాలను బుక్‌ చేసుకున్నారు. అవి ఈ రైలులో ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ స్టేషన్‌కు చేరాలి. అయితే అనుకున్న విధంగా సమయానికి రైలు గమ్యస్థానం చేరుకోలేదు. రోజులు గడుస్తున్నా రైలు స్టేషన్‌కి రాకపోవడంతో అనుమానం వచ్చిన గుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా రైలు ఎక్కడుందనే జాడకూడా ఎవ్వరికీ తెలియలేదు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అరుదైన పాము ప్రత్యక్షం.. తక్షక వంశానికి చెందిన నాగుగా నిర్ధారణ

అమెజాన్‌లో తెలుగు కుర్రాడికి జాక్‌పాట్‌.. ప్యాకేజ్ ఎంతో తెలుసా ??

జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. శాశ్వతంగా దానికి దూరమే !!

గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు