జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. శాశ్వతంగా దానికి దూరమే !!
గత కొన్ని రోజులుగా అటు పర్సనల్ లైఫ్ లోనూ, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ బాగా స్ట్రగుల్ అవుతున్నాడు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. తన దగ్గర పనిచేసిన ఓ లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు జానీపై ఆరోపణలున్నాయి. ఇదే కేసులో అతను సుమారు నెల రోజుల పాటు జైలు జీవితం గడిపారు. కొన్ని రోజుల క్రితమే బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన ఇంటికే పరిమితమయ్యారు.
తన కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా సమయం గడుపుతున్నారు. అయితే చాలా రోజుల తర్వాత ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించారు జానీ మాస్టర్. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ నటించిన కేసీఆర్ కు హాజరైన జానీ కాస్త ఎమోషనల్ గా మాట్లాడారు. కాగా లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్ ప్రొఫెషనల్ కెరీర్ కూడా బాగా దెబ్బతింది. చేతిదాకా వచ్చిన జాతీయ అవార్డు దూరమైంది. అలాగే పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ కు కొరియోగ్రఫీ చేయాల్సి ఉన్నా అది కూడా వేరొకరికి వెళ్లిపోయింది. తాజాగా జానీ మాస్టర్ కు మరో బిగ్ షాక్ తగిలింది. డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి ఆయనను శాశ్వతంగా తొలగించారు. అంతేకాకుండా డిసెంబర్ 09న జరిగిన డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ అధ్యక్షుడిగా గెలిచారు. ఇది నిజంగా జానీ మాస్టర్ కు భారీ ఎదురుదెబ్బేనని చెప్పుకోవచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

