అమెజాన్‌లో తెలుగు కుర్రాడికి జాక్‌పాట్‌.. ప్యాకేజ్ ఎంతో తెలుసా ??

అమెజాన్‌లో తెలుగు కుర్రాడికి జాక్‌పాట్‌.. ప్యాకేజ్ ఎంతో తెలుసా ??

Phani CH

|

Updated on: Dec 12, 2024 | 8:33 PM

ప్రముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్‌లో తెలంగాణ యువ‌కుడు జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా రూ.2 కోట్ల ప్యాకేజీతో జాబ్‌ సాధించాడు. తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండ‌లం తుంకిమెట్ల గ్రామానికి చెందిన అర్బాజ్ ఖురేషీ అమెజాన్‌లో ఈ అరుదైన అవ‌కాశం ద‌క్కించుకున్నాడు. అమెజాన్‌లో అప్లైడ్ సైంటిస్ట్‌గా రూ.2కోట్ల వార్షిక వేత‌నంతో జాబ్ సాధించి వార్తల్లో నిలిచాడు.

అంతేకాదు సోమవారం ఆయన విధుల్లో చేరుతున్నట్టు సమాచారం. అర్బాజ్ ఖురేషీ 2019లో పాట్నా ఐఐటీ నుంచి కంప్యూట‌ర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేశాడు. అయితే, బీటెక్ థ‌ర్డ్ ఇయ‌ర్‌లో ఉండ‌గా ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ మెషిన్ లెర్నింగ్ నిష్ణాతుడు గేల్ డ‌యాస్ వ‌ద్ద మూడు నెల‌ల పాటు ఇంట‌ర్న్‌షిప్ చేశాడు. బీటెక్ పూర్తయిన త‌ర్వాత బెంగ‌ళూరులోని మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌లో రెండేళ్లు ప‌నిచేశాడు. అనంత‌రం గ‌తేడాది అమెరికాలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ నుంచి ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో ఎంఎస్ ప‌ట్టా అందుకున్నాడు. ఇక త‌న‌ కుమారుడికి అమెజాన్‌లో భారీ ప్యాకేజీతో కొలువు దొర‌క‌డం ప‌ట్ల తండ్రి యాసిన్ ఖురేషీ హ‌ర్షం వ్యక్తం చేశారు. ఆయ‌న ప్రస్తుతం ఎక్సైజ్ జాయింట్ క‌మిష‌న‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. శాశ్వతంగా దానికి దూరమే !!

గుడ్‌ న్యూస్‌.. తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు