AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bad Breath: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? సింపుల్ చిట్కాలివిగో..

కొంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా నోటి దుర్వాసనను అదుపు చేయలేక ఇబ్బంది పడిపోతుంటారు. ఇందుకు ప్రధాన కారణం ఆహర అలవాట్లే. పోషకాహారం తీసుకోవడంతోపాటు ఈ కింది సింపుల్ చిట్కాలు ట్రై చేస్తే ఈ సమస్య క్షణాల్లో వదిలిపోతుంది..

Srilakshmi C
|

Updated on: Dec 13, 2024 | 9:17 PM

Share
నోటి దుర్వాసనతో బాధపడేవారు నలుగురిలోకి వెళ్లేందుకు ఇబ్బంది పడిపోతుంటారు. ఎవరితోనైనా మాట్లాడటం కూడా కష్టంగా ఉంటుంది. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం రాంగ్ డైట్ అని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
అలాగే రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోకపోవడం, నాలుకను శుభ్రం చేసుకోకపోవడం, పళ్లు తోముకోకుండా రాత్రి నిద్రపోవడం వంటి చెడు అలవాట్ల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. అయితే శ్వాసను తాజాగా ఉంచేందుకు మార్కెట్లో అనేక రకాల మౌత్ ఫ్రెషనర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇంట్లోనే ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఎలాగంటే..

2 / 5
పుదీనా నోటి దుర్వాసనకు మంచి రెమెడీ. సోంపు, యాలకులు, పుదీనా కూడా సహజమైన మౌత్ ఫ్రెషనర్లుగా పని చేస్తాయి. అందుకే భోజనం తర్వాత పుదీనా ఆకులను నమలాలని నిపుణులు చెబుతున్నారు. ఇది నోటి దుర్వాసనను తొలగిస్తుంది.

3 / 5
ఆహారంలో లవంగాలను ఎలా చేర్చుకోవాలంటే.. ఉదయం టీలో 2-3 లవంగాలను జోడించి తాగవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిలో లవంగాలను వేసి రోజంతా త్రాగవచ్చు. వంగాల పొడిని సూప్‌లు, డెజర్ట్‌లపై చల్లి వినియోగించవచ్చు.

4 / 5
కొత్తిమీర ఒక అద్భుతమైన క్రిమినాశక. ఇందులో సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల నోటి దుర్వాసనను సులభంగా తొలగిస్తుంది. భోజనం తిన్న తర్వాత రెండు కొత్తిమీర ఆకులను బాగా నమలడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.

5 / 5