Potato Roast: పొటాటో రోస్ట్ ఇలా చేశారంటే.. మొత్తం లాగించేస్తారు..
బంగాళ దుంప అంటే చాలా మందికి ఫేవరెట్ ఫుడ్. ఆలు గడ్డతో ఎలాంటి వెరైటీలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. ఆలూతో ఎన్నో రకాల వేల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా రకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరో కొత్త రెసిపీ మీ కోసం తీసుకొచ్చాం. అదే విధంగా బంగాళ దుంప తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం తీసుకోకూడదు. చాలా మంది ఎక్కువగా..
బంగాళ దుంప అంటే చాలా మందికి ఫేవరెట్ ఫుడ్. ఆలు గడ్డతో ఎలాంటి వెరైటీలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. ఆలూతో ఎన్నో రకాల వేల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. ఇప్పటికే చాలా రకాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరో కొత్త రెసిపీ మీ కోసం తీసుకొచ్చాం. అదే విధంగా బంగాళ దుంప తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం తీసుకోకూడదు. చాలా మంది ఎక్కువగా ఆలూ ఫ్రై చేసుకుంటూ ఉంటారు. ఎలాంటి వాటితో తిన్నా సైడ్ డిష్ గా చాలా రుచిగా ఉంటుంది. అదే విధంగా ఆలూ రోస్ట్ కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఇలా వెరైటీగా చేసి పెట్టండి. లొట్టలేసుకుంటూ.. ఎలాంటి అనారోగ్య సమస్యల గురించి కూడా ఆలోచించకుండా తినేస్తారు. మరి ఈ ఆలూ రోస్ట్ ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలూ రోస్ట్‌కి కావాల్సిన పదార్థాలు:
ఆలు గడ్డలు, కారం, పసుపు, ఉప్పు, మిరియాల సొడి, కొబ్బరి నూనె, అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తి మీర, సోంపు, ఆయిల్.
ఆలూ రోస్ట్ తయారీ విధానం:
ముందుగా బంగాళ దుంపకు తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్లలో వేయాలి. ఇలా వేస్తే ముక్క క్రంచీగా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి, కరివేపాకులు వేసి మెత్తగా పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ రోస్ట్ చేయడానికి ఖచ్చితంగా మీకు నాన్ స్టిక్ పాన్ కావాలి. ఎందుకంటే ఇందులో త్వరగా మాడిపోకుండా ఉంటుంది. కాబట్టి నాన్ స్టిక్ పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది.
నూనె వేడెక్కగానే బంగాళ దుంప ముక్కలు వేసి.. ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియంలో పెట్టి మధ్య మధ్యలో వేయిస్తూ ఉండి. ఇవి రంగు మారిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, సోంపు పొడి, మిరియాల పొడి వేసి కలపాలి. ఇవి కాస్త వేగాక.. మిక్సీ పట్టిన పేస్టు కూడా వేసి కలుపుకోవాలి. ఇలా చిన్న మంట మీద ఓ ఐదు నిమిషాలు వేగాక.. చివరగా కొత్తి మీర చల్లి దించేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే ఆలూ రోస్ట్ సిద్దం. ఇలాగ మీరు ఇతర కూరగాయలు, చికెన్, ఎగ్ తో కూడా ట్రై చేయవచ్చు.