Carrot Kheer: హెల్దీ క్యారెట్ ఖీర్.. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు..

పాయసం అంటే చాలా మందికి ఇష్టం. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వర్షా కాలంలో వేడి వేడిగా తీసుకుంటే ఎంతో మంచిది. ఇందులో పాలు, సేమియా, సగ్గుబియ్యం, బెల్లం, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. కాబట్టి పిల్లలు కూడా తినవచ్చు. ఎప్పుడూ తయారు చేసుకునే సగ్గుబియ్యం కాకుండా.. కాస్త వెరైటీగా క్యారెట్‌తో ఖీర్ తయారు చేసుకుంటే మరింత మంచిది. ఈ సారి క్యారెట్ ఖీర్‌ని కూడా ప్రసాదంగా దేవుడికి నివేదించవచ్చు. ఇది తయారు చేయడం..

Carrot Kheer: హెల్దీ క్యారెట్ ఖీర్.. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు..
Carrot Kheer
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 21, 2024 | 10:51 AM

పాయసం అంటే చాలా మందికి ఇష్టం. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వర్షా కాలంలో వేడి వేడిగా తీసుకుంటే ఎంతో మంచిది. ఇందులో పాలు, సేమియా, సగ్గుబియ్యం, బెల్లం, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. కాబట్టి పిల్లలు కూడా తినవచ్చు. ఎప్పుడూ తయారు చేసుకునే సగ్గుబియ్యం కాకుండా.. కాస్త వెరైటీగా క్యారెట్‌తో ఖీర్ తయారు చేసుకుంటే మరింత మంచిది. ఈ సారి క్యారెట్ ఖీర్‌ని కూడా ప్రసాదంగా దేవుడికి నివేదించవచ్చు. ఇది తయారు చేయడం కూడా చాలా సింపుల్. మరి క్యారెట్ ఖీర్ ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

క్యారెట్ ఖీర్‌కి కావాల్సిన పదార్థాలు:

క్యారెట్, పాలు, డ్రై ఫ్రూట్స్, సేమియా, కుంకుమ పువ్వు, పంచదార లేదా బెల్లం, నెయ్యి, యాలకుల పొడి.

క్యారెట్ ఖీర్‌ తయారీ విధానం:

ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి.. అందులో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. మీకు ఇష్టమైన డ్రై ఫ్రైట్స్ తీసుకుని సన్నగా కట్ చేసి వేయించి పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత సేమయాలను కూడా వేయించి పక్కన పెట్టాలి. ఆ నెక్ట్స్ ఈ పాన్‌లోనే క్యారెట్ తురుము కూడా వేసి వేయించాలి. చిన్న మంట మీద మాడకుండా ఫ్రై చేయాలి. క్యారెట్ తురుము బాగా వేయించాక.. ఇందులోనే పాలు పోసి మరిగించాలి. ఇలా ఓ పావుగంట సేపు చిన్న మంట మీద ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఇందులోనే సేమియాలు, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా కలపాలి. ఖీర్ కాస్త దగ్గరగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే క్యారెట్ పాయం సిద్ధం. ఈ ఖీర్‌ని వేడిగా ఉన్నప్పుడైనా తినవచ్చు. లేదంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా అయ్యాక అయినా తినొచ్చు.