Rava Pongal: రవ్వ పొంగలి ఈ స్టైల్‌లో చేస్తే.. ప్లేట్ మొత్తం ఖాళీ..

రవ్వతో సాధారణంగా ఉప్మా లేదంటే స్వీట్లు తయారు చేస్తారు. కానీ పొంగలి కూడా తయారు చేసుకోవచ్చు. ఎంతో ఫాస్ట్‌గా ఈ బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. రాత్రి పూట లైట్‌గా తినాలి అనుకునేవారు ఈ పొంగలి డిన్నర్‌గా కూడా తినవచ్చు. చట్నీ లేదా సాంబార్‌తో తింటే ఇంకా రుచిగా ఉంటుంది. లేదంటే నేరుగా ఉత్తిది అయినా తినవచ్చు. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక్కసారి ఇంట్లో ట్రై..

Rava Pongal: రవ్వ పొంగలి ఈ స్టైల్‌లో చేస్తే.. ప్లేట్ మొత్తం ఖాళీ..
Rava Pongal
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 21, 2024 | 7:47 PM

రవ్వతో సాధారణంగా ఉప్మా లేదంటే స్వీట్లు తయారు చేస్తారు. కానీ పొంగలి కూడా తయారు చేసుకోవచ్చు. ఎంతో ఫాస్ట్‌గా ఈ బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. రాత్రి పూట లైట్‌గా తినాలి అనుకునేవారు ఈ పొంగలి డిన్నర్‌గా కూడా తినవచ్చు. చట్నీ లేదా సాంబార్‌తో తింటే ఇంకా రుచిగా ఉంటుంది. లేదంటే నేరుగా ఉత్తిది అయినా తినవచ్చు. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. ఖచ్చితంగా ఇష్టపడతారు. కొద్దిగా నెయ్యి, జీడిపప్పు తగిలిస్తే ఆహా ఇల్లంతా ఘమఘమల వాసనే. మరి ఈ రవ్వ పొంగలి ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రవ్వ పొంగలికి కావాల్సిన పదార్థాలు:

బొంబాయి రవ్వ, పెసరపప్పు, జీలకర్ర, ఆవాలు, అల్లం తురుము, జీడిపపపు, మిరియాలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, నెయ్యి.

రవ్వ పొంగలి తయారీ విధానం:

ముందుగా పెసర పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి కుక్కర్‌లో ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించాక.. మిరియాలు వేయాలి ఇవి కూడా వేగాక పచ్చి మిర్చి వేసి వేయించాలి. ఆ నెక్ట్స్ అల్లం తురుము వేసి నీళ్ళు పోయాలి.

ఇవి కూడా చదవండి

ఇందులో ఉప్పు వేసి రుచి చూసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు రవ్వ వేసి ఒక ఉడుకు ఉడికా.. ఉడికించిన పెసర పప్పు వేసి కలుపుకోవాలి. పొంగలి బాగా ఉడికాక.. దించేసి కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రవ్వ పొంగలి సిద్ధం. ఎంతో సింపుల్‌గా అయిపోతుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.