Mutton Biryani: కుక్కర్‌లో సింపుల్‌గా మటన్ బిర్యానీ ఇలా చేశారంటే.. ఆహా అనాల్సిందే!

మటన్ అంటే చాలా మందికి ఇష్టం. బయట తినడం కంటే ఇంట్లో తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. బయట వేలు పెట్టినా.. చాలా తక్కువ ముక్కలే వేస్తారు. అయినా ఈ మధ్య హోటల్స్ ఎలా చేస్తున్నాయో టీవీల్లో కూడా చూశాం. ఎలా వండుతారో కూడా తెలీదు. అందులోనూ ఇప్పుడు వర్షా కాలం. బయట తినడం అంత సేఫ్ కాదు. అదే మన ఇంట్లోనే చేసుకుని తింటే ఆరోగ్యం. కాబట్టి సింపుల్‌గా త్వరగా మటన్ బిర్యానీని కుక్కర్‌లో ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా త్వరగా కూడా..

Mutton Biryani: కుక్కర్‌లో సింపుల్‌గా మటన్ బిర్యానీ ఇలా చేశారంటే.. ఆహా అనాల్సిందే!
Mutton Biryani
Follow us
Chinni Enni

|

Updated on: Jul 21, 2024 | 5:46 PM

మటన్ అంటే చాలా మందికి ఇష్టం. బయట తినడం కంటే ఇంట్లో తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారు. బయట వేలు పెట్టినా.. చాలా తక్కువ ముక్కలే వేస్తారు. అయినా ఈ మధ్య హోటల్స్ ఎలా చేస్తున్నాయో టీవీల్లో కూడా చూశాం. ఎలా వండుతారో కూడా తెలీదు. అందులోనూ ఇప్పుడు వర్షా కాలం. బయట తినడం అంత సేఫ్ కాదు. అదే మన ఇంట్లోనే చేసుకుని తింటే ఆరోగ్యం. కాబట్టి సింపుల్‌గా త్వరగా మటన్ బిర్యానీని కుక్కర్‌లో ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా త్వరగా కూడా అయిపోతుంది. అంతే కాదు టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంత రుచికరమైన మటన్ బిర్యానీని కుక్కర్‌లో ఎలా చేసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు:

మటన్, బియ్యం (ఏదైనా), కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పులావ్ దినుసులు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, నిమ్మరసం, నెయ్యి, ఆయిల్.

కుక్కర్‌లో మటన్ బిర్యానీ తయారు చేయు విధానం:

ముందుగా బియ్యం కడిగి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకుని అందులో.. కొద్దిగా ఆయిల్, నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత పులావ్ దినుసులు అన్నీ వేసి వేగాక, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న మటన్ వేసి ఓ నిమిషం ఫ్రై అయ్యాక.. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించాక.. టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకూ ఉడికించాలి. ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసి ఓ ఐదు నిమిషాలు వేగాక వాటర్, గరం మసాలా వేసి కుక్కర్ మూత పెట్టి.. ఐదు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి.

ఇవి కూడా చదవండి

కుక్కర్ వేడి తగ్గాక మూత తీసి.. మటన్ ఉడికిందో లేదో చూసుకోవాలి. ముక్క ఉడికితే అన్నీ రుచి చూసుకుని పొయ్యి మీద పెట్టాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. బాస్ మతీ రైస్ అయితే ఒకటికి.. ఒకటింపావు వేయాలి. సాధారణ బియ్యం అయితే ఒకటికి ఒకటిన్నర వేయాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా, కొత్తిమీర చల్లి.. మూత పెట్టాలి. ఓ రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ బిర్యానీ సిద్ధం. అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ బిర్యానీ సిద్ధం. మీరు కూడా ముందు కొద్దిగా వండి ట్రై చేయండి.

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!