- Telugu News Photo Gallery Farmers says that tomato prices are likely to increase due to rains in AP and Telangana
ఎర్రబంగారంలా మారిన టమాటా..? కిలో ధర అంత పలుకుతుందా..!
కర్నూలు జిల్లాలో టమోటా రేట్లు భారీగా పెరుగుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులలో కిలో టమోటా 30 రూపాయలు నుండి 80 రూపాయలకు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు టమోటా పంటలు దెబ్బతినడం, దిగుబడులు తగ్గిపోవడంతో టమోటా రేట్లు భారీగా పెరుగుతున్నాయి. 30 రూపాయలు ఉన్న కిలో టమోటా రెండు రోజులలో 80 రూపాయలకు పెరిగింది.
Updated on: Jul 21, 2024 | 7:38 PM

కర్నూలు జిల్లాలో టమోటా రేట్లు భారీగా పెరుగుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వారం రోజులలో కిలో టమోటా 30 రూపాయలు నుండి 80 రూపాయలకు పెరగడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు టమోటా పంటలు దెబ్బతినడం, దిగుబడులు తగ్గిపోవడంతో టమోటా రేట్లు భారీగా పెరుగుతున్నాయి. 30 రూపాయలు ఉన్న కిలో టమోటా రెండు రోజులలో 80 రూపాయలకు పెరిగింది.

మరో రెండు, మూడు రోజుల్లో 100 రూపాయలకి చేరే అవకాశం ఉందంటున్నారు మర్కెట్ యాజమాన్యం. గత సంవత్సరం ఇదే ఖరీఫ్ సీజన్లో కిలో టమోటా 200 రూపాయలు పెరిగి రికార్డు సృష్టించిందని గుర్తు చేస్తున్నారు.

గతంలో టమోటా పంటకు మంచి రేట్లు ఉన్నాయని రైతులు ఎక్కువ టమోటా పంటను సాగుచేశారు. ఖరీఫ్ సీజన్లో కిలో టమోటా 200 రూపాయల నుండి రెండు రూపాయలు పడిపోయి భారీ స్థాయిలో నష్టపోయారు రైతులు.

అయితే ఈ టమోటా పంటను తక్కువ స్థాయిలో సాగు చేయడం.. వేసిన పంట వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో టమోటా రేట్లు భారీగా పెరుగుతాయని అంటున్నారు. మరో వారం రోజులు వర్షాలు కురిస్తే టమోటా పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు రైతులు. తద్వారా రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.




