నితిన్, రామ్, గోపీచంద్, వరుణ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్, కార్తికేయ, నాగశౌర్య... వీళ్ల పరిస్థితి కూడా ఇంతకు మారుగా ఏమీ లేదు. ఆచితూచీ సినిమాలు చేస్తున్నారు. అవి ఆడకపోతే, ఇంకాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు. ఆ గ్యాప్‌లో మంచి స్క్రిప్ట్ పడితే ఓకే. ఒకవేళ మళ్లీ తప్పటడుగుపడితే... పెట్టిన బడ్జెట్ వసూలు కాక... నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురవుతోంది. వీటన్నిటికీ ఫుల్‌స్టాప్ పడాలంటే మీడియం రేంజ్ హీరోలు గేర్ మార్చాలి. స్పీడు పెంచాలి. అప్పుడే ఏడాదిలో ఒకటి పోయినా... ఇంకొకటి ఆడినా.. సినిమా ఇండస్ట్రీ కళకళలాడుతుంది. వాళ్ల కెరీర్‌కీ ఢోకా ఉండదు అన్నది శ్రేయోభిలాషుల నుంచి అందుతున్న మాట.