- Telugu News Photo Gallery Cinema photos These Celebrity Couples Are Separated in 2024 Hardik Pandya natasa to esha deol bharat takhtani
Tollywood: ఏడాదిలో విడిపోయిన స్టార్ కపుల్స్.. 2024లో విడాకులు తీసుకున్న సెలబ్రెటీ జంటలు..
ప్రస్తుతం ఇండస్ట్రీలో విడాకుల ట్రెండ్ జోరుగా నడుస్తుంది. ఓవైపు పలువురు స్టార్స్ వైవాహిక బంధంలోకి అడుగుపెడుడుతుంటే మరోవైపు బ్యూటీఫుల్ కపుల్స్ డివోర్స్ అనౌన్స్ చేసి అభిమానులకు షాకిస్తున్నారు. 2024 ఏడాది మొదలై 7 నెలలు గడుస్తుంటే ఇప్పటికే ఐదు సెలబ్రెటీ జంటలు విడిపోయాయి. బాలీవుడ్ నటి, ఒకప్పటీ డ్రీమ్ గర్ల్ హేమమాలిని, ధర్మేంద్రల కుమార్తె ఈషా డియోల్ తన భర్త భరత్ తఖ్తానీ నుంచి విడాకులు తీసుకుంది.
Updated on: Jul 21, 2024 | 9:07 PM

ప్రస్తుతం ఇండస్ట్రీలో విడాకుల ట్రెండ్ జోరుగా నడుస్తుంది. ఓవైపు పలువురు స్టార్స్ వైవాహిక బంధంలోకి అడుగుపెడుడుతుంటే మరోవైపు బ్యూటీఫుల్ కపుల్స్ డివోర్స్ అనౌన్స్ చేసి అభిమానులకు షాకిస్తున్నారు. 2024 ఏడాది మొదలై 7 నెలలు గడుస్తుంటే ఇప్పటికే ఐదు సెలబ్రెటీ జంటలు విడిపోయాయి.

బాలీవుడ్ నటి, ఒకప్పటీ డ్రీమ్ గర్ల్ హేమమాలిని, ధర్మేంద్రల కుమార్తె ఈషా డియోల్ తన భర్త భరత్ తఖ్తానీ నుంచి విడాకులు తీసుకుంది. 2012న జూన్ 29న ఇస్కాన్ దేవాలయంలో పెళ్లి చేసుకున్న వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఏడాది వీరిద్దరు డివోర్స్ తీసుకున్నట్లు ప్రకటించారు.

నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇషా కొప్పికర్.. వ్యాపారవేత్త టిమ్మీ నారంగ్ తో విడిపోతున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. 2009లో పెళ్లి చేసుకున్న వీరిద్దరికి ఒక కుమార్తె ఉంది.

బుల్లితెర నటి దల్జీత్ కౌర్ ఆమె రెండో భర్త నిఖిల్ పటేల్ కూడా ఈ ఏడాదిలోనే విడిపోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి కెన్యాలో సెటిల్ అయిన దల్జీత్ కౌర్.. ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసింది.

ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ లవ్ బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా అరోరా కూడా ఈ ఏడాది విడిపోయారు. వీరిద్దరి బ్రేకప్ గురించి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కలిసి కనిపించడం లేదు. అలాగే అర్జున్ పుట్టినరోజు వేడుకలలో మలైకా పాల్గొనలేదు.

ఇక టిమిండియా క్రికెటర్ హార్దిక్ పాడ్య, నటి కం మోడల్ నటాసా స్టాంకోవిచ్ కూడా ఈ ఏడాదిలోనే తన వైవాహిక బంధాన్ని ముగించారు. వీరిద్దరికి కుమారుడు అగస్త్య ఉన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా వీరిద్దరు విడాకుల గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది.




