AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

జున్నులో కొంత కొవ్వు, క్యాలరీలు ఉంటాయి. జున్నును ఎక్కువగా తినడం మంచిది కాదు. గర్భిణి స్త్రీలు జున్నులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తల్లిపాలు సరిగాపడని బాలింతలు జున్ను తింటే మంచిది. జున్ను తీసుకోవడం ద్వారా చర్మం సౌందర్యం కూడా రెట్టింపు అవుతుంది.

Health Tips: జున్ను తిన‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా ?
Junnu
Jyothi Gadda
|

Updated on: Jul 20, 2024 | 9:47 PM

Share

జున్ను పాలు ఆవు లేదా గేదె ప్రసవించినప్పుడు మొదటిసారిగా వచ్చే పాలతో తయారు చేసేదే జున్ను. సాధారణ పాలను కూడా బాగా మరగకాచి జున్ను తయారు చేసుకోవచ్చు. ఈ జున్నులో పాలకంటే అధిక మోతాదులో పోషక విలువలు ఉన్నాయి. జున్నుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు. జున్ను పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. జున్నులోని ప్రోటీన్ కండరాల నిర్మాణానికి , నిర్వహణకు ఎంతో అవసరం. బక్కగా, సన్నగా ఉండేవారు జున్ను తింటుంటే వళ్లు చేస్తారని అంటారు.

జున్నులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి, జున్ను తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. జున్నులో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాల బలానికి ఎంతో దోహదపడుతుంది. కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జున్నులో విటమిన్లు A, B12 , K ఉంటాయి. ఖనిజాలలో పొటాషియం, మెగ్నీషియం , జింక్ కలిగి ఉంటాయి. తరచూ జున్ను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తరచూ జున్ను తినేవారిలో మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. జున్నులో సమృద్ధిగా లభించే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరికి మలబద్దకం అజీర్తి సమస్యలను తొలగిస్తుంది.

జున్నులో కొంత కొవ్వు, క్యాలరీలు ఉంటాయి. జున్నును ఎక్కువగా తినడం మంచిది కాదు. గర్భిణి స్త్రీలు జున్నులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే శిశువు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తల్లిపాలు సరిగాపడని బాలింతలు జున్ను తింటే మంచిది. జున్ను తీసుకోవడం ద్వారా చర్మం సౌందర్యం కూడా రెట్టింపు అవుతుంది. జున్ను మరీ ఎక్కువగా తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే ఏదైనా ఆహారం మోతాదుకు మించి తినకూడదు అనే మాట జున్నుకు వర్తిస్తుంది. మితిమీరి జున్ను తింటే అది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..