Red Amaranth: ఎర్ర తోటకూర తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు..
అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. రక్త పోటు స్థాయిలను అదుపు చేయడంలో ఎర్ర తోటకూర ఉపయోగపడుతుంది. ఎర్ర తోటకూర తీసుకోవడం వల్ల గుండె పోటు, ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది. జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది. క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. ఇక గర్భిణీలకు కూడా ఎర్ర తోటకూర ఎంతో మంచిది. ముఖ్యంగా ఎర్రతోట కూరను తరుచూ తీసుకుంటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
మనం రెగ్యులర్‌గా ఆకు కూరలు తింటుంటాం. ఆకు కూరలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు దాదాపు అందరికీ తెలిసిందే. ఆకు కూరల్లో అనేక పోషకాలు లభిస్తాయి. అలాంటి ఆకు కూరల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిల్లో ఎర్ర తోట కూర కూడా ఒకటి. ఎర్ర తోట కూర తినడం వల్ల అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఈ ఆకు కూర తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఎర్ర తోటకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, పాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, ప్రోటీన్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. అందుకే ఆరోగ్యానికి ఎర్ర తోటకూర ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వారానికి ఒకటి, రెండు సార్లు ఎర్ర తోటకూరను తీసుకుంటే అందులో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలు దృఢంగా మారేందుకు సహాయపడుతుంది.
ఎర్ర తోటకూరలో పొటాషియం కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది రక్త పోటును నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గి.. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. డయాబెటీస్ ఉన్నవారు ఈ ఎర్ర తోట కూర తింటే రక్తంలో.. షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. కంటి సమస్యలను తగ్గించి.. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. క్యాల్షియం కూడా మెండుగా లభిస్తుంది. కాబట్టి ఎముకల ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
అదే విధంగా ఎర్ర తోటకూరలో ఐరన్ కూడా లభ్యమవుతుంది. కాబట్టి ఇది తినడం వల్ల రక్త హీనత సమస్య ఉండదు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. తక్షణమే శక్తిని కూడా ఇస్తుంది. అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. రక్త పోటు స్థాయిలను అదుపు చేయడంలో ఎర్ర తోటకూర ఉపయోగపడుతుంది. ఎర్ర తోటకూర తీసుకోవడం వల్ల గుండె పోటు, ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది. జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది. క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది. ఇక గర్భిణీలకు కూడా ఎర్ర తోటకూర ఎంతో మంచిది. ముఖ్యంగా ఎర్రతోట కూరను తరుచూ తీసుకుంటే కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
ఎర్రతోట కూర ఊబకాయానికి ఉత్తమ నివారణ. స్థూలకాయాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనిలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాలను దృఢంగా చేస్తుంది. సీజనల్ గా వచ్చే వైరల్ ఇన్ ఫెక్షన్లతో పోరాడగల శక్తి ఎర్రతోటకూరతో లభిస్తుంది. అలాగే గొంతు క్యాన్సర్ రాకుండా ఎర్రతోట కూర సహాయం చేస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..