Viral Video: వర్షంలో స్టైల్‌గా రీల్ ట్రై చేశాడు..! ఆట మొదలుపెట్టగానే కథ అడ్డం తిరిగింది..? ఏమైందంటే..
ఓ వ్యక్తి వర్షంలో రీల్ చేయాలనే ఉద్దేశంతో ఉత్సాహంగా వెళ్లాడు. తీరా కెమెరా ఆన్ చేసి, డాన్స్ చేసే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియో ఓపెనింగ్‌లో ఓ వ్యక్తి రీల్ చేసేందుకు రెడీగా ఉన్నాడు.. అయితే అందరిలా కాకుండా ఏదైనా డిఫరెంట్‌గా చేయాలని అనుకున్నాడో ఏమో గానీ.. వర్షంలో వినూత్నంగా డాన్స్ వేసి వైరల్ అవ్వాలని ట్రై చేశాడు. ఇందు కోసం
విస్తృతమైన ఇంటర్‌నెట్ వినియోగంతో సోషల్ మీడియా వేదికగా ఫేమస్ అవ్వాలని చాలా మంది ఆరాటపడుతున్నారు. వ్యూస్, లైకుల కోసం వివిధ రకాల స్టెంట్స్ చేయడం, వారిలోని టాలెంట్‌నంతా బయటకు తీసి ప్రపంచానికి చూపిస్తూ ప్రశంసలు పొందాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఎలాంటి సాహసాలు చేయడైనా వెనుకాడటం లేదు. కొందరు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంటే..ఇంకొందరు బహిరంగ ప్రదేశాల్లో డాన్సులు వేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వ్యక్తి రీల్స్ చేస్తుండగా ఊహించని సీన్ ఎదురైంది. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యం ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..
ఓ వ్యక్తి వర్షంలో రీల్ చేయాలనే ఉద్దేశంతో ఉత్సాహంగా వెళ్లాడు. తీరా కెమెరా ఆన్ చేసి, డాన్స్ చేసే సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియో ఓపెనింగ్‌లో ఓ వ్యక్తి రీల్ చేసేందుకు రెడీగా ఉన్నాడు.. అయితే అందరిలా కాకుండా ఏదైనా డిఫరెంట్‌గా చేయాలని అనుకున్నాడో ఏమో గానీ.. వర్షంలో వినూత్నంగా డాన్స్ వేసి వైరల్ అవ్వాలని ట్రై చేశాడు. ఇందు కోసం తన ఇంటి పైకి వెళ్లి వర్షంలో ఫోన్ కెమెరాను ఆన్ చేశాడు. కెమెరా ఆన్ చేసి వేగంగా వెళ్లి గింగిరాలు తిరుగుతూ డాన్స్ చేయాలని అనుకున్నాడు. పాపం అతని ప్లాన్ బెడిసికొట్టింది. వేగంగా గింగిరాలు తిరగడంతో అదుపు తప్పి బోల్తా పడ్డాడు. రీల్స్ కోసం డ్యాన్స్ కాదుకదా..! కనీసం సరిగ్గా లేచి నిలబడలేక కుంటు కుంటూ అవస్థపడాల్సి వచ్చింది.
Self-inflicted kalesh while Making Instagram Reels in Rain pic.twitter.com/y5fQ3qrI6Z
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 17, 2024
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. రీల్స్ పిచ్చి ఉండాలే గానీ.. మరీ ఇంతలా ఉండకూడదు’’.. అంటూ కొందరు కామెంట్ చేయగా, ఏదో చేయాలని చూస్తే ఇంకేదో అయిందంటూ సెటెర్లు వేస్తున్నారు. చాలా మంది రకరకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..