AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ యవ్వన రహస్యం ఇదేనట..! రెండు రోజులు తేడా వచ్చినా మీ ఆయుష్షు మూడినట్టే..!- అధ్యయనం

నిద్ర మనుషుల జీవితాలను మారుస్తుంది. ఇది ఆరోగ్యంపై తక్షణ, ముఖ్యమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. సరైన ఆహారం, తక్కువ శారీరక శ్రమ ప్రభావాలు కనిపించడానికి కొంత సమయం పడుతుంది. రాత్రిపూట నిద్రలేమి ప్రభావాలు జీవనశైలి ప్రవర్తనలను కూడా ప్రభావితం చేస్తుంది.

మీ యవ్వన రహస్యం ఇదేనట..! రెండు రోజులు తేడా వచ్చినా మీ ఆయుష్షు మూడినట్టే..!- అధ్యయనం
Sleep
Jyothi Gadda
|

Updated on: Jul 20, 2024 | 5:36 PM

Share

ప్రతిరోజూ 7-8 గంటల నిద్ర చాలా ముఖ్యం. ఏదో రెండు రోజులు 4 గంటలు నిద్రపోతే ఏమవుతుందిలే.. అనుకున్నారో మీ ఆయుష్షు మూడినట్టే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిద్రపట్ల మీరు చేస్తున్న ఈ నిర్లక్ష్యం మీ మానసిక స్థితిని, వయస్సును ప్రభావితం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. మీరు రెండు రోజుల నిద్రను స్కిప్ చేసినా, అది మీ వయస్సుపై ప్రభావం చూపుతుందని, మీ వయస్సు రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. సరైన, ప్రశాంతమైన నిద్ర మీకు ఆరోగ్యంతో పాటు ఆయుష్షును కాపాడుతుందంటున్నారు. పెరుగుతున్న వయస్సు ప్రభావం మీపై పడకుండా ఉంటుందని చెబుతున్నారు. స్వీడిష్ సైకాలజిస్టులు దీనిపై పరిశోధనలు చేశారు. వరుసగా రెండు రాత్రులు కేవలం నాలుగు గంటలపాటు నిద్రపోయే వారు నాలుగేళ్లు పెద్దవారిగా కనిపిస్తున్నారని పరిశోధకులు తెలిపారు. నిద్ర లేకపోవడం వల్ల వయసు దశాబ్దాలు పెరుగుతాయని పరిశోధకులు కనుగొన్నారు.

ఈ అధ్యయనంలో తొమ్మిది గంటల మంచి నిద్ర పొందిన వ్యక్తులు, కేవలం నాలుగు గంటలు మాత్రమే నిద్రపోయిన వారి పట్ల పరిశోధన జరిపించారు. తగినంత విశ్రాంతి తీసుకున్నవారు తమ వాస్తవ వయస్సు కంటే సగటున మూడు నెలలు చిన్నవారిగా కనిపిస్తున్నారు. కేవలం రెండు రాత్రులు తక్కువ నిద్రపోయినవారు వయసులో పెద్దవారిగా కనిపించారని పరిశోధకులు వెల్లడించారు. నిద్ర లేకపోవడం వృద్ధాప్య భావనతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని గుర్తించారు.

ఈ మేరకు పరిశోధకులు రెండు అధ్యయనాలు నిర్వహించారు. మొదటిదశలో 18 నుంచి 70 ఏళ్లలోపు 429 మంది పాల్గొన్నారు. వారు ఎంత సేపు నిద్రపోయారు, ఎంత వయసొచ్చారు అనే సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. ప్రతిరోజూ పేలవంగా నిద్రపోయే వ్యక్తులు సగటున మూడేళ్ల అధిక వయస్సువారిగా, అదే తగినంత నిద్ర పొందిన వ్యక్తులు సగటున ఆరేళ్లు చిన్నవారిగా కనిపిస్తున్నట్టుగా పరిశోధకులు తెలిపారు. మీరు యవ్వనంగా ఉండాలనుకుంటే తగినంత నిద్ర పొందడం చాలా ముఖ్యం. నిద్ర మనుషుల జీవితాలను మారుస్తుంది. ఇది ఆరోగ్యంపై తక్షణ, ముఖ్యమైన ప్రభావాలను కలిగి ఉంటుంది. సరైన ఆహారం, తక్కువ శారీరక శ్రమ ప్రభావాలు కనిపించడానికి కొంత సమయం పడుతుంది. రాత్రిపూట నిద్రలేమి ప్రభావాలు జీవనశైలి ప్రవర్తనలను కూడా ప్రభావితం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఒక ప్రత్యేక అధ్యయనం 4,000 కంటే ఎక్కువ మంది యూరోపియన్లను పరీక్షించింది. 10 సంవత్సరాల అధ్యయనం ప్రకారం, వారానికి రెండు లేదా మూడు సార్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తులు నిష్క్రియంగా ఉన్న వారి కంటే నిద్రలేమితో బాధపడే అవకాశం తక్కువగా ఉందని గుర్తించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..