AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పోలీస్‌ డాగ్‌ సాహసం.. వర్షంలో 8 కిలోమీటర్లు పరుగెత్తి మహిళ ప్రాణాలు కాపాడింది..

పెద్దగా అరుపులు వినిపించిన ఒక ఇంటి వద్ద ఆగింది ఆ పోలీస్‌ డాగ్‌. అక్కడ గట్టిగా మొరగడంతో పోలీస్‌ డాగ్‌ను వెంబడిస్తూ వెళ్లిన పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్ధలుకొట్టారు. ఒక మహిళను కొట్టి చంపుతున్న హంతకుడ్ని పట్టుకున్నారు. స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న ఆ మహిళను రక్షించారు. మరోవైపు హత్యకు గురైన వ్యక్తిని

పోలీస్‌ డాగ్‌ సాహసం..  వర్షంలో 8 కిలోమీటర్లు పరుగెత్తి మహిళ ప్రాణాలు కాపాడింది..
Police Dog Saves Woman's Li
Jyothi Gadda
|

Updated on: Jul 19, 2024 | 8:59 PM

Share

ఓ పోలీస్‌ జాగిలం చేసిన పనికి ప్రజలంతా దానిని ప్రశంసిస్తున్నారు. పోలీస్‌డాగ్ సాహాసానికి ప్రజలు సెల్యూట్‌ చేస్తున్నారు. జోరు వర్షంలో 8 కిలోమీటర్లు పరిగెత్తిన జాగిలం హంతకుడి బారినుంచి మహిళ ప్రాణాలను కాపాడింది. హత్యకు గురైన వ్యక్తి మృతదేహం వద్ద వాసన చూసిన పోలీస్‌ డాగ్‌ అతడు మరో హత్య చేయకుండా అడ్డుకోగలిగింది. కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలో గురువారం రాత్రి 9.45 గంటల సమయంలో సంతబెన్నూరులోని పెట్రోలు బంక్‌ సమీపంలో హత్యకు గురైన ఒక వ్యక్తి మృతదేహాన్ని గస్తీ పోలీసులు గమనించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా, ఎస్పీ ఉమా ప్రశాంత్ వెంటనే స్పందించారు. పోలీస్‌ డాగ్‌ తుంగ 2, దాని హ్యాండ్లర్‌ అయిన కానిస్టేబుల్ షఫీ, ఇతర పోలీస్‌ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించారు.

ఇవి కూడా చదవండి

డాబర్‌మ్యాన్ డాగ్‌ ఆ మృతదేహం వద్ద వాసన చూసింది. హంతకుడ్ని పసిగట్టేందుకు అక్కడి నుంచి పరుగులు తీసింది. పై నుంచి జోరు వర్షం కురుస్తుండగా, వానలో 8 కిలోమీటర్ల దూరం పరుగెత్తింది. చన్నాపురా గ్రామానికి చేరింది. పెద్దగా అరుపులు వినిపించిన ఒక ఇంటి వద్ద ఆగింది ఆ పోలీస్‌ డాగ్‌. అక్కడ గట్టిగా మొరగడంతో పోలీస్‌ డాగ్‌ను వెంబడిస్తూ వెళ్లిన పోలీసులు ఆ ఇంటి తలుపులు బద్ధలుకొట్టారు. ఒక మహిళను కొట్టి చంపుతున్న హంతకుడ్ని పట్టుకున్నారు. స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్న ఆ మహిళను రక్షించారు. మరోవైపు హత్యకు గురైన వ్యక్తిని 33 ఏళ్ల సంతోష్‌గా పోలీసులు గుర్తించారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు.

Follow Us
నేను కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. కొందరు కమిట్మెంట్స్ అడిగారు
నేను కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. కొందరు కమిట్మెంట్స్ అడిగారు
పండుగ సమయంలో బహుమతిగా ఇవ్వడానికి బెస్ట్ బ్లూటూత్‌ స్పీకర్ ఇదే!
పండుగ సమయంలో బహుమతిగా ఇవ్వడానికి బెస్ట్ బ్లూటూత్‌ స్పీకర్ ఇదే!
రసగుల్లా గొంతులో ఇరుక్కుని 8 ఏళ్ల బాలుడు మృతి!
రసగుల్లా గొంతులో ఇరుక్కుని 8 ఏళ్ల బాలుడు మృతి!
'లైఫ్‌లో క్లారిటీ తప్పనిసరి.. తప్పు జరిగితే ఫుల్‌స్టాప్ పెట్టాలి'
'లైఫ్‌లో క్లారిటీ తప్పనిసరి.. తప్పు జరిగితే ఫుల్‌స్టాప్ పెట్టాలి'
అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య..
అప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్.. కట్ చేస్తే మాజీ సీఎం భార్య..
టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసింది ఎవరో తెలుసా ?
టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసింది ఎవరో తెలుసా ?
సెమీకండక్టర్ల రంగంలో భారత్ సరికొత్త చరిత్ర
సెమీకండక్టర్ల రంగంలో భారత్ సరికొత్త చరిత్ర
నఖ్వీని గెంటెయడానికి బీసీసీఐ మాస్టర్ ప్లాన్
నఖ్వీని గెంటెయడానికి బీసీసీఐ మాస్టర్ ప్లాన్
160కిపైగా సినిమాలు.. స్టార్ హీరోలతో జతకట్టిన అందాల తార..
160కిపైగా సినిమాలు.. స్టార్ హీరోలతో జతకట్టిన అందాల తార..
హైదరాబాదీలు మర్చిపోయిన నీలోఫర్ కథ.. ఆ హాస్పిటల్ వెనుక అసలు స్టోరీ
హైదరాబాదీలు మర్చిపోయిన నీలోఫర్ కథ.. ఆ హాస్పిటల్ వెనుక అసలు స్టోరీ