- Telugu News Photo Gallery Chandipura Virus Infected By Sand Fly Maintain These Tips To Save Childrens
Chandipura virus: కలకలం రేపుతున్న చాందిపుర వైరస్.. గుజరాత్‌లో మరో మరణం..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ప్రస్తుతం దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో చండీపురా వైరస్ ఇన్ఫెక్షన్ నమోదైంది. అందులో అత్యధికంగా సోకిన రాష్ట్రం గుజరాత్. ప్రాథమికంగా చండీపురా వైరస్ ఈగలు, దోమలు, కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. ఎలాంటి ఈగలు, దోమలు ఇన్‌ఫెక్షన్‌ను వ్యాపింపజేస్తున్నాయో నిపుణులు కొన్ని ఆనవాళ్లు కనిపెట్టారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jul 19, 2024 | 5:50 PM

గుజరాత్‌లో చాందిపుర వైరస్ కలకలం రేపుతున్నది. ఆ వైరస్ బారినపడి ఇప్పటికే సబర్‌కాంతా జిల్లాలో ఒక చిన్నారి మరణించాడు. తాజాగా వడోదర జిల్లాలో మరో మరణం సంభవించింది. దాంతో వడోదర జిల్లాలో తొలి మరణం, గుజరాత్‌లో రెండో మరణంగా నమోదైంది. ఇటీవల అస్వస్థతకు గురైన ఆరేళ్ల బాలుడిని ఎస్‌ఎస్‌జీ ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి కేవలం 10 గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఆ బాలుడి టెస్ట్ రిపోర్టులో చాందిపుర వైరస్ సోకినట్లు తేలింది. గత కొన్ని రోజులుగా గుజరాత్‌లో చాందిపుర వైరస్ కేసులు నమోదవుతున్నాయి.

కోవిడ్ తర్వాత చండీపురా వైరస్ ఇప్పుడు కొత్త ముప్పుగా మారింది. ఇప్పటికే దేశంలో ఈ వైరస్ కారణంగా 15 మంది చిన్నారులు చనిపోయారు. దీంతో పాటు పలువురు వ్యాధి బారిన పడి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో చండీపురా వైరస్ ఇన్ఫెక్షన్ నమోదైంది. అందులో అత్యధికంగా సోకిన రాష్ట్రం గుజరాత్. మృతులు, బాధిత చిన్నారుల్లో ఎక్కువ మంది గుజరాత్‌కు చెందినవారే ఉన్నారు.

ప్రాథమికంగా, చండీపురా వైరస్ ఈగలు, దోమలు, కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. తాజాగా చండీపురా వైరస్ సోకిన బాలిక ఇంట్లో 19 ఈగల జాడలు బయటపడ్డాయి. అలాగే 4 ఇసుక ఈగలు కూడా దొరికాయి. వాటి నమూనాలను ల్యాబ్ పంపారు.

చండీపురా అనేది RNA వైరస్, ఆడ ఫ్లోబోటోమైన్ ఫ్లైస్ ద్వారా వ్యాపిస్తుంది. దోమలు కూడా ఈ వైరస్ వాహకాలు కావచ్చు. దోమ కాటు ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతాయి. చండీపురా వైరస్‌ను మోసుకెళ్లే ఈగలు ప్రధానంగా తేమతో కూడిన ప్రాంతాల్లో నివసిస్తాయి. ఫలితంగా, ఇన్ఫెక్షన్ ఇంట్లో కూడా వ్యాపిస్తుంది. మట్టి ఇళ్లు లేదా ప్లాస్టర్ చేయని ఇళ్ల గోడల పగుళ్లలో ఈ ఈగలు నివసిస్తాయి. ఇంటి లోపల గోడలకు కూడా పగుళ్లు ఏర్పరచుకుంటాయి.

చండీపురా వైరస్‌ను నిరోధించడానికి ప్రస్తుతం వ్యాక్సిన్ లేదు. జాగ్రత్తగా ఉండటం ఒక్కటే మార్గం అంటున్నారు నిపుణులు. లక్షణాల ఆధారంగా రోగికి చికిత్స చేయించాల్సి ఉంటుంది. చండీపురా వైరస్‌ను నివారించడానికి పిల్లలను ఈగలు, దోమల నుండి దూరంగా ఉంచాలి. బయట ఆడుకోవడానికి వెళుతున్నప్పుడు వారికి చేతులు, కాళ్లు పూర్తిగా కవర్ అయ్యేలా బట్టలు, ప్యాంటు ధరించాలి. ఈగలు, దోమలను తరిమికొట్టేందుకు ఇంట్లోనే నివారణ చిట్కాలను పాటించాలి.





























