- Telugu News Photo Gallery If your house is cleaned like this, you will get out of financial difficulties, check here is details
Vastu Tips: మీ ఇంటిని ఇలా తుడిచారంటే.. ఆర్థిక కష్టాల నుంచి బయట పడతారు..
వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించడమే కాకుండా.. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే.. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంతే కాకుండా ఆర్థిక కష్టాల నుంచి, అనేక బాధలు తొలగతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకుంటుంది. సంతోషం వెల్లివిరుస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని సయమాల్లో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు. ఇంటిని తుడుచు కోవటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇల్లు తుడవటానికి, మాప్ పెట్టడానికి బ్రహ్మ ముహూర్తం..
Updated on: Jul 19, 2024 | 5:36 PM

వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించడమే కాకుండా.. వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే.. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంతే కాకుండా ఆర్థిక కష్టాల నుంచి, అనేక బాధలు తగ్గుతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకుంటుంది. సంతోషం వెల్లివిరుస్తుంది.

వాస్తు ప్రకారం ఇంట్లో కొన్ని సమయాల్లో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవచ్చు. ఇంటిని తుడుచు కోవటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇల్లు తుడవటానికి, మాప్ పెట్టడానికి బ్రహ్మ ముహూర్తం ఉత్తమ సమయంగా చెప్పవచ్చు

బ్రహ్మ ముహూర్తంలో ఇల్లు తుడవటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పోయి.. సంతోషం వెల్లివిరుస్తుంది. ఇంటి పురోగతికి కూడా బాటలు పడతాయి.

ఉదయం లేచి ఇంటిని తుడవటం వల్ల ఇంట్లోకి సౌర శక్తి కూడా ప్రకాశిస్తుంది. దీని వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంటిని ఎప్పుడూ మెయిన్ డోర్ నుంచి లేదా ఈశాన్య మూల నుంచి ప్రారంభించి నైరుతి దిశగా తుడవాలి.

వాస్తు ప్రకారం ఇంట్లో మాప్ పెట్టేటప్పుడు బకెట్ నీటిలో రాతి ఉప్పు అంటే రాళ్ల ఉప్పును కలిపి ఇంటిని తుడవటం చాలా మంచిది. ఇందులో నిమ్మరసం కూడా కలపవచ్చు. మురికి అంతా పోయి.. మంచి సువాసన వస్తుంది. ఇంటిని తుడిచేందుకు ఉపయోగించే బకెట్ ఎరుపు రంగులో ఉండకూడదు.




