వీడి ప్రేమ బంగారంగాను.. భార్యపై ప్రేమతో.. ప్రతిరోజూ 320 కిమీల ప్రయాణం.. అసలు మ్యాటరేంటంటే?

అందుకే పెళ్లి తర్వాత కూడా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు. భార్యపై ఉన్న ప్రేమ కారణంగానే ఇంత దూరం ప్రయాణించాలని నిర్ణయించుకున్నానని లిన్ చెబుతున్నాడు. తన ప్రయాణం గురించి ఆఫీస్‌లో మేనేజర్‌కి తెలియటంతో.. తనను ఎక్కువ సమయం ఆఫీసులో ఉండనిచ్చే వారు కాదని, త్వరగా పని ముగించుకుని వెళ్లామని చెబుతారని అన్నాడు. తనకు అనుకూలంగా రవాణ వ్యవస్థ పట్ల కూడా అతడు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. 

వీడి ప్రేమ బంగారంగాను.. భార్యపై ప్రేమతో.. ప్రతిరోజూ 320 కిమీల ప్రయాణం.. అసలు మ్యాటరేంటంటే?
Chinese Husband
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 20, 2024 | 4:40 PM

కొత్తగా పెళ్లయిన 31 ఏళ్ల వ్యక్తి తన భార్య ప్రేమ కోసం రోజూ 320 కిలోమీటర్ల మేర ప్రయాణం కొనసాగిస్తున్నాడు. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ డౌయిన్‌లో అతడు తన రోజువారీ ప్రయాణానికి సంబందించిన అనేక వీడియోలను పోస్ట్ చేశాడు. వీడియోలలో అతను తన రోజువారీ షెడ్యూల్‌ను వెల్లడించాడు. తన ప్రయాణాన్ని లాంగ్‌ జర్నీగా అతడు వివరించాడు. అతడి ప్రయాణం ఎందుకో తెలిసి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లకు అది చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు సదరు వ్యక్తిని పొగడ్తలతో ముంచేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

వైరల్‌ అవుతున్న ఒక వీడియోలో సదరు చైనీయుడు మిస్టర్ లిన్ తాను ఉదయం 5 గంటలకు నిద్రలేచి, తూర్పు చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని వైఫాంగ్‌లోని తన ఇంటి నుండి బయల్దేరుతాడు. ఉదయం 5:20 గంటలకు తన ప్రయాణం మొదలుపెడతానని వివరించారు. అతను ఉదయం 6:15 గంటలకు రైలు పట్టుకోవడానికి స్టేషన్‌కు 30 నిమిషాల పాటు ఎలక్ట్రిక్ బైక్‌ డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తాడు. అక్కడ్నుంచి ట్రైన్‌లో ఉదయం 7:46 గంటలకు షాన్‌డాంగ్ తూర్పు భాగంలోని కింగ్‌డావోకు చేరుకుంటాడు.. అక్కడ్నుంచి తన ఆఫీసుకు వెళ్లేందుకు 15 నిమిషాల అండర్‌గ్రౌండ్‌ సబ్‌వే ద్వారా ప్రయాణిస్తాడు. ఉదయం 9 గంటలకు ఆఫీస్‌ లాగిన్‌కు ముందు తన కంపెనీ క్యాంటీన్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ ముగిస్తానని మిస్టర్ లిన్ చెప్పారు. సరిగ్గా ఉదయం 9 గంటలకు ఆఫీస్‌లో లాగిన్‌ రిపోర్ట్ చేస్తాడు. ఇంటి నుండి బయల్దేరి ఆఫీసుకి చేరుకుని పని ప్రారంభించడానికి దాదాపు నాలుగు గంటల సమయం పడుతుంది. మళ్లీ అదే దారిలో సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుంటాడు. తన ఆఫీస్‌ నుంచి160 కి.మీ దూరంలో ఉన్న ఇంటికి వెళ్లడానికి మరో మూడు నుండి నాలుగు గంటలు పడుతుంది. ప్రతిరోజూ అతడు ఇంతే సుదూర ప్రయాణం సాగిస్తున్నట్టుగా లిన్‌ తన పోస్ట్‌ ద్వారా వెల్లడించారు.

ఇంత సుదీర్ఘ ప్రయాణం గురించి లిన్ షుని అడిగితే, తన ప్రేమ కోసమే ఇదంతా అని నవ్వుతూ చెప్పాడు. భార్య ప్రేమతో ప్రయాణం బోర్ కొట్టదు. ఏడేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత ఈ మేలో లిన్ తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నట్టుగా చెప్పాడు. లిన్ మదాడి వైఫాంగ్‌లో నివసిస్తున్నారు. వివాహానికి ముందు, లిన్ అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో నివసించారు. అక్కడ నుండి తన భార్య పని చేస్తున్నా ఆఫీసుకు వెళ్లాలంటే.. ఒక గంట ప్రయాణం చేయాల్సి ఉంటుందని చెప్పాడు.. అందుకే పెళ్లి తర్వాత కూడా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పారు. భార్యపై ఉన్న ప్రేమ కారణంగానే ఇంత దూరం ప్రయాణించాలని నిర్ణయించుకున్నానని లిన్ చెబుతున్నాడు. తన ప్రయాణం గురించి ఆఫీస్‌లో మేనేజర్‌కి తెలియటంతో.. తనను ఎక్కువ సమయం ఆఫీసులో ఉండనిచ్చే వారు కాదని, త్వరగా పని ముగించుకుని వెళ్లామని చెబుతారని అన్నాడు. తనకు అనుకూలంగా రవాణ వ్యవస్థ పట్ల కూడా అతడు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!