AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తండ్రి బర్త్ డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. నాన్న రియాక్షన్ వెలకట్టలేనిది.. మనసుని హత్తుకుంటున్న వీడియో

తమ ఉన్నతి కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూస్తూ ఎదిగిన పిల్లలు.. తమ సక్సెస్ ను అందులో సంతోషాన్ని తెలియజేస్తూ తల్లిదండ్రుల కోసం ఏదైనా చేయాలని కోరుకుంటారు. ఇలా చేయడం పిల్లల భాద్యత, కర్తవ్యం కూడా. ప్రస్తుతం తండ్రి కూతురుకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన వారి మనసుని హత్తుకుంటుంది.

Viral Video: తండ్రి బర్త్ డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. నాన్న రియాక్షన్ వెలకట్టలేనిది.. మనసుని హత్తుకుంటున్న వీడియో
Daughter And Father LoveImage Credit source: Instagram/thesassynandin
Surya Kala
|

Updated on: Jul 20, 2024 | 1:13 PM

Share

తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏమైనా చేస్తారు, పిల్లల సుఖ సంతోషాలు కోసం పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడి వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నాడు. ఒక్కోసారి పిల్లలకు చెప్పకుండానే సర్ ప్రైజ్ గిఫ్ట్స్ తల్లిదండ్రులు ఇస్తుంటారు. అటువంటి పరిస్థితిలో తమ ఉన్నతి కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూస్తూ ఎదిగిన పిల్లలు.. తమ సక్సెస్ ను అందులో సంతోషాన్ని తెలియజేస్తూ తల్లిదండ్రుల కోసం ఏదైనా చేయాలని కోరుకుంటారు. ఇలా చేయడం పిల్లల భాద్యత, కర్తవ్యం కూడా. ప్రస్తుతం తండ్రి కూతురుకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన వారి మనసుని హత్తుకుంటుంది.

వీడియోలో తన తండ్రి పుట్టినరోజున కుమార్తె అతనికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం కనిపించింది. కూతురు ఇచ్చిన గిఫ్ట్ ను తీసుకున్న తర్వాత తండ్రి భావోద్వేగానికి గురయ్యాడు. కళ్లలో నీళ్లు తిరిగాయి. ఒక యువతి నగల దుకాణానికి వెళ్లి తన తండ్రి కోసం బంగారు గొలుసును కొనుగోలు చేసింది. దానిని గిఫ్ట్ ప్యాక్ చేయించి ఇంటికి తీసుకువచ్చింది. తండ్రి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన తర్వాత ఆ యువతి తండ్రికి బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చింది. కూతురు ఇచ్చిన ఈ బహుమతిని అందుకున్న తండ్రి భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత కూతురు స్వయంగా ఆ గొలుసును తన తండ్రి మెడలో వేసింది. ఇది తండ్రికి నిజంగా ఎమోషనల్ మూమెంట్.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఈ హృదయాన్ని హత్తుకునే వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో thesassynandini_ అనే IDతో షేర్ చేశారు. ‘నేను నా తండ్రి పుట్టినరోజున ఆశ్చర్యపరిచాను. వాస్తవానికి ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని అనుకున్నా.. కానీ నా తండ్రి రియాక్షన్ చూసి నా హృదయం భావోద్వేగాలతో నిండిపోయింది. మా నాన్నకు ఈ బహుమతి ఇవ్వాలనేది తన కల అని .. ఈ రోజు అతని కుమార్తెగా తను చాలా గర్వ పడుతున్నానని పేర్కొంది. అంతేకాదు తాను చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పింది ఆ యువతి. తన తండ్రి కన్నీరు చూసి తనతో పాటు అక్కడ ఉన్నవారు అందరూ కన్నీరు పెట్టుకున్నారని ఈ వీడియోతో పాటు తన ఫీలింగ్స్ ను కామెంట్ రూపంలో జత చేసింది ఆ యువతి.

ఈ అద్భుతమైన వీడియోను 6 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ అంటే 60 లక్షల మందికి పైగా చూశారు. 5.5 లక్షల మందికి పైగా ప్రజలు వీడియోను లైక్ చేసారు. వివిధ రకాల కామెంట్స్ చేస్తూ తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. ‘తాను కూడా తన తల్లిదండ్రులకు ఇలాంటి క్షణాలను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నానని ఒకరు కామెంట్ చేయగా.. నన్ను ఇంత గొప్పగా చెయ్యి భగవంతుడా.. అది చాలు అని మరొకరు కామెంట్ చేశారు. మరొకరు ‘పాప కౌగిలించుకున్న తీరు చూసి నేనూ కన్నీళ్లు పెట్టుకున్నాను’ అంటే ‘బంగారు గొలుసు ముఖ్యం కాదు, తండ్రి కౌగిలి ముఖ్యం’ మరొకరు ఇలా రకరకాల కామెంట్స్ తో నెట్టింట్లో సందడి చేస్తుంది ఈ వీడియో.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..