AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayuveda Tips: ఆకుల్లో భోజనం చేయడం వలన ఎంత ఆరోగ్యమో తెలుసా.. ఏ ఆకుల్లో ఆహారం తింటే ఏ ప్రయోజనాలు అంటే..

పూర్వం ఆహారాన్ని భుజించడానికి అరటి ఆకు, మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరి వంటివాటిని ఉపయోగించే వారు.. కాలక్రమంలో ఆహారాన్ని తినడానికి స్టీల్ ప్లేట్స్ వచ్చాయి. ఇప్పుడు స్టీల్ ప్లేట్ల స్థానంలో ప్లాస్టిక్ ప్లేట్లు చేరాయి. వీటిల్లో ఆహారం తినడం వలన క్రమ క్రమంగా శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.. అనేక వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. ముఖ్యంగా చర్మ సంబంధ , నరాల సంబంధ సమస్యలతో పాటు కేన్సర్ బారిన కూడా పడుతున్నారు. ఈ నేపధ్యంలో వంట చేసే పాత్రలపైనే కాదు ఆహారాన్ని భుజించే విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఈ రోజు ఎటువంటి ఆకులతో చేసిన విస్తరాకులలో తింటే ఎటువంటి ఫలితాలు ఆయుర్వేదంలో చెప్పిన విషయాలను తెలుసుకుందాం..

Ayuveda Tips: ఆకుల్లో భోజనం చేయడం వలన ఎంత ఆరోగ్యమో తెలుసా.. ఏ ఆకుల్లో ఆహారం తింటే ఏ ప్రయోజనాలు అంటే..
Leaf Plates Benefits
Surya Kala
|

Updated on: Jul 20, 2024 | 11:19 AM

Share

భారతీయ సాంప్రదాయంలో ఆహారం తీసుకునేందుకు అనేక నియమాలున్నాయి. ఆహారం పదార్ధాలను తయారు చేసే వంట గది నుంచి తినే ప్రదేశం, ఆహారం వడ్డించుకునే విధానం, కుర్చుని తినే పధ్ధతి ఇలా అనేక నియమ నిబంధాలను పెద్దలు పెట్టారు. అయితే కాలక్రమంలో మనవ జీవన శైలిలో వచ్చిన మార్పుల్లో భాగంగా ఆహారం తయారు చేయడంలో మార్పులే.. తినే విషయంలోనూ మార్పులే. అందుకే నేటి మనిషి అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నాడు. పూర్వం ఆహారాన్ని భుజించడానికి అరటి ఆకు, మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరి వంటివాటిని ఉపయోగించే వారు.. కాలక్రమంలో ఆహారాన్ని తినడానికి స్టీల్ ప్లేట్స్ వచ్చాయి. ఇప్పుడు స్టీల్ ప్లేట్ల స్థానంలో ప్లాస్టిక్ ప్లేట్లు చేరాయి. వీటిల్లో ఆహారం తినడం వలన క్రమ క్రమంగా శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.. అనేక వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. ముఖ్యంగా చర్మ సంబంధ , నరాల సంబంధ సమస్యలతో పాటు కేన్సర్ బారిన కూడా పడుతున్నారు. ఈ నేపధ్యంలో వంట చేసే పాత్రలపైనే కాదు ఆహారాన్ని భుజించే విషయంలో శ్రద్ధ పెట్టాలి. ఈ రోజు ఎటువంటి ఆకులతో చేసిన విస్తరాకులలో తింటే ఎటువంటి ఫలితాలు ఆయుర్వేదంలో చెప్పిన విషయాలను తెలుసుకుందాం..

అరటి ఆకు: ఆహారం తినడానికి మిక్కిలి శ్రేష్టం అరటి ఆకు. దీనిలో ఆహారం తినడం వలన కఫవాతములు హరిస్తాయి. అంతేకాదు ఆరోగ్యంగా ఉంటారు. శ్లేష్మ సంబంధ ఇబ్బందులు తగ్గుతాయి. శరీరకాంతి మెరుగు పడుతుంది. సంభోగ శక్తి పెరుగుతుంది. ఆకలి కలుగుతుంది. దంతాలను సంరక్షిస్తుంది. శరీరం నొప్పులు దరిచేరవు. అంతేకాదు అల్సర్ ను నయం చేస్తుంది.

పనస ఆకు విస్తరి: ఈ పనసాకులతో తయారు చేసిన విస్తరిలో ఆహారం తినడం వలన దీనిలో ఔషధతత్వాలు శరీరానికి అందుతాయి. దీనిలోని ఫైటోన్యూట్రియంట్లు గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి రోగాల బారిన పడకుండా సహాయ పడతాయి. అగ్నివృద్ధి జరుగుతుంది. పిత్తహర గుణం కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

మర్రి ఆకు విస్తరి: మర్రిఆకులతో చేసిన విస్తరిలో ఆహారం తినడం వలన విష దోషాలను హరిస్తుంది. దీనిలో ఆహారం తినడం వలన జఠరాగ్ని వృద్ది చెందుతుంది. నేత్ర దృష్టి పెరుగుతుంది. వీర్యవృద్ధి పెరుగుతుంది. మర్రి ఆకుతో తయారు చేసిన విస్తరితో భోజనం చేయడం వలన నోటిపూతను నియంత్రిస్తుంది.

మోదుగ విస్తరి: మోదుగ ఆకుల్లో కూడా గొప్ప మహత్తు ఉంది. ఈ ఆకులతో చేసిన విస్తరిలో కానీ మోదుగ దొప్పలలోగాని భోజనం చేస్తే వెండిపాత్రలో భోజనం చేసినంత లాభం కలుగుతుంది. మోదుగ విస్తరిలో ఆహారం భుజించడం వలన రక్తసంబంధ రోగాల బారిన పడకుండా ఉంటారు. పిత్త రోగం నుంచి ఉపశమనం లభిస్తుంది. బుద్ది కుశలతను పెంచును.

రావి ఆకు విస్తరి: ఈ ఆకులో ఆహారం తినడం వలన గొంతు వ్యాధులను నివారిస్తుంది. ఎర్ర రక్తకణాలు చురుగ్గా పని చేస్తాయి. అందుకే కామెర్ల వ్యాధి బాధితులకు ఆయుర్వేద వైద్యులు రావి ఆకులో మందు ఇస్తారు. అంతేకాదు పిత్తశ్లేష్మాన్ని నివారిస్తుంది. అగ్నివృద్ది, వీర్యవృద్ధిని కలిగిస్తుంది.

తామరాకు విస్తరి: తామరాకుని ఎండ బెట్టి విస్తరిగా చేసుకుని అందులో ఆహారం తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె, శరీర కండరాల పనితీరుని మెరుగుపరుస్తుంది.

ఆకుల్లో భుజించడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కనుక వీలైనంత వరకూ ప్లాస్టిక్ ప్లేట్స్ ను వదిలి ఆకులలో భోజనం చేయడం వలన ఆకులలో ఉండే ఔషధ గుణాలు శరీరంలోకి చేరి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయని చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏ రకమైన విత్తనాలనైనా ఉపయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)