Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో వీరిపైనే ఆశ.. ఈ క్రీడాకారుల శిక్షణకై ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసా..

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంగ్రామం జూలై 26 నుంచి పారిస్‌లో ప్రారంభం కానుంది. దీనికి కొద్ది రోజుల ముందు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక వివరణాత్మక నివేదికను విడుదల చేసింది. దీనిలో టోక్యో ఒలింపిక్స్ తర్వాత పారిస్ సైకిల్ తయారీకి వివిధ క్రీడలు, ఆటగాళ్ల కోసం ఎంత ఖర్చు చేశారో వెల్లడించింది. దీని ప్రకారం అథ్లెటిక్స్‌ కోసం అత్యధికంగా రూ.96 కోట్లు ఖర్చు చేయగా, బ్యాడ్మింటన్‌కు రూ.72 కోట్లు, హాకీకి రూ.41.81 కోట్లు ఖర్చు చేశారు. ఈ నేపధ్యంలో పారిస్ ఒలింపిక్స్ కి రెడీ అవుతున్న ఐదుగురు అథ్లెట్ల శిక్షనపై ప్రత్యెక శ్రద్ధ పెట్టింది. వీరికి సన్నాహాలకు ప్రభుత్వం ఎక్కువ సహాయం అందించింది

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ లో వీరిపైనే ఆశ.. ఈ క్రీడాకారుల శిక్షణకై ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసా..
Paris Olympics 2024
Follow us
Surya Kala

|

Updated on: Jul 20, 2024 | 9:52 AM

ఆసియా క్రీడలు 2022లో ప్రభుత్వం ‘ఈసారి 100 పార్’ (‘ఈసారి 100 పతకాలు) అనే నినాదాన్ని ఇచ్చింది. ఇపుడు 2024 పారిస్ ఒలింపిక్స్ వంతు వచ్చింది. వేసవి ఒలింపిక్స్ కోసం ‘ఈసారి, 10 పార్’ (10 పతకాలు) అని నినాదంతో పాల్గొంటుంది. ఆసియా క్రీడలతో పోలిస్తే ఈ 10 పతకాల సంఖ్య చిన్నదే అయినా అది ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్‌లో 7 పతకాలతో రికార్డు సృష్టించిన తర్వాత.. ఇప్పుడు భారత అథ్లెటిక్స్ లక్ష్యం 10 పతకాలు. ఆసియా క్రీడల్లాగే ఇందులోనూ భారత ఆటగాళ్లు విజయం సాధించగలరా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఒలింపిక్స్‌ సన్నద్ధత కోసం గత 3 ఏళ్లలో దాదాపు ప్రతి అథ్లెట్‌పై భారత ప్రభుత్వం లక్షలు, కోట్లు ఖర్చు చేసింది. దీంతో క్రీడాకారులపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అగ్రస్థానంలో ఉన్నాడు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంగ్రామం జూలై 26 నుంచి పారిస్‌లో ప్రారంభం కానుంది. దీనికి కొద్ది రోజుల ముందు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక వివరణాత్మక నివేదికను విడుదల చేసింది. దీనిలో టోక్యో ఒలింపిక్స్ తర్వాత పారిస్ సైకిల్ తయారీకి వివిధ క్రీడలు, ఆటగాళ్ల కోసం ఎంత ఖర్చు చేశారో వెల్లడించింది. దీని ప్రకారం అథ్లెటిక్స్‌ కోసం అత్యధికంగా రూ.96 కోట్లు ఖర్చు చేయగా, బ్యాడ్మింటన్‌కు రూ.72 కోట్లు, హాకీకి రూ.41.81 కోట్లు ఖర్చు చేశారు. ఈ నేపధ్యంలో పారిస్ ఒలింపిక్స్ కి రెడీ అవుతున్న ఐదుగురు అథ్లెట్ల శిక్షనపై ప్రత్యెక శ్రద్ధ పెట్టింది. వీరికి సన్నాహాలకు ప్రభుత్వం ఎక్కువ సహాయం అందించింది.

నీరజ్ చోప్రా:

ఇవి కూడా చదవండి

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై మరోసారి భారీ అంచనాలు ఉన్నాయి. ఒలంపిక్స్ తర్వాత జరిగిన అనేక పెద్ద ఈవెంట్లలో పతకాలు గెలుచుకున్నాడు. అందుకే ఈ బల్లెం వీరుడిపై మరోసారి భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి పతక పోటీదారుగా నిలిచాడు. అటువంటి పరిస్థితిలో గత 3 సంవత్సరాలలో నీరజ్ చోప్రా శిక్షణ కోసం ప్రభుత్వం చాలా ఖర్చు చేసింది. నీరజ్‌కి విదేశాల్లో శిక్షణ, విదేశీ కోచ్, ఇతర అవసరాల కోసం రూ.5.72 కోట్లను సాయి వెచ్చించింది.

సాత్విక్-చిరాగ్:

బ్యాడ్మింటన్‌లో భారత్‌కు అతిపెద్ద ఆశాకిరణంగా నిలిచిన పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టిలకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభించింది. తాజాగా బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 జోడీగా నిలిచి చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్.. విదేశాల్లో శిక్షణ, టోర్నీల్లో పాల్గొనడమే కాకుండా విదేశీ కోచ్‌ల కోసం వెచ్చించిన మొత్తం రూ.5.62 కోట్లు. ఈ మొత్తాన్ని ప్రభుత్వం భరించింది.

పీవీ సింధు:

వరుసగా రెండు ఒలింపిక్స్‌లో రజతం, కాంస్య పతకాలు సాధించి అద్భుతాలు చేసిన స్టార్ షట్లర్ పీవీ సింధుకు ప్రభుత్వం నుంచి కూడా సాయం అందింది. వరుసగా మూడో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా అవతరించాలని భావిస్తున్న సింధు.. జర్మనీలో శిక్షణ సౌకర్యాలతో పాటు విదేశీ కోచ్, సహాయక సిబ్బందిని కూడా నియమించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.3.13 కోట్లను అందించింది.

మీరాబాయి చాను:

గత ఒలింపిక్స్‌లో రజత పతకంతో దేశం ఒలిపిక్స్ లో పతకాల పట్టికలో ఖాతా తెరిచిన వెటరన్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుపై ఈ సారి కూడా భారీ అంచనాలున్నాయి. మీరాబాయి మళ్లీ పతకం తెస్తుంది అనే ఆశలు చిగురించాయి. అందుకే మీరాబాయికి అమెరికాలో శిక్షణతోపాటు బయోమెకానికల్ పరికరాల వంటి ఖర్చుల కోసం ప్రభుత్వం రూ.2.74 కోట్ల సాయం అందించింది.

అనీష్ భన్వాలా:

21 ఏళ్ల షూటర్ అనీష్ భన్వాలా కూడా గత రెండు వరుస ఒలింపిక్స్‌లో షూటింగ్ జట్టు వైఫల్యానికి ముగింపు పలకాలని భావిస్తున్నారు. ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేయనున్న అనీష్‌కు వ్యక్తిగత కోచ్‌తో జర్మనీలో శిక్షణతో పాటు మందుగుండు సామగ్రి కొనుగోలులో సహాయంగా ప్రభుత్వం నుండి రూ.2.41 కోట్ల సహాయం అందించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
మెగా వేలం ఆక్షనీర్ మల్లికా సాగర్ బయోడేటా..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!