AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Somnath Temple: సోమనాథ జ్యోతిర్లింగాన్ని ఎవరు ప్రతిష్టించారు? పురాణం ప్రకారం ఈ క్షేత్రం ప్రాముఖ్యత ఏమిటంటే?

ఈ జ్యోతిర్లింగాన్ని చంద్రుడు స్వయంగా నిర్మించాడని ఒక నమ్మకం. సోమనాథ ఆలయంలో శివుడిని ప్రత్యేక పూజలతో పూజిస్తారు. సోమనాథుడు అంటే 'సోమ ప్రభువు'. సోమ అంటే చంద్రుడు , నాథ అంటే ప్రభువు, కనుక సోమనాథ అంటే చంద్రునికి ప్రభువు అని అర్ధం. ఈ దేవాలయం శివుడు సమస్త సృష్టికి ఆధారమని,  సమస్త జీవరాశిని పోషించేవాడని ప్రతీకాత్మకంగా చూపిస్తుంది.

Somnath Temple: సోమనాథ జ్యోతిర్లింగాన్ని ఎవరు ప్రతిష్టించారు? పురాణం ప్రకారం ఈ క్షేత్రం ప్రాముఖ్యత ఏమిటంటే?
Somnath Jyotirlinga
Surya Kala
|

Updated on: Jul 20, 2024 | 7:57 AM

Share

హిందూ మతంలో జ్యోతిర్లింగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి.  ఈ జ్యోతిర్లింగాలన్నీ శివుని అనంతమైన శక్తి రూపంగా పరిగణించబడతాయి. ఈ 12 జ్యోతిర్లింగాలలో సోమనాథ జ్యోతిర్లింగం మొదటి స్థానంలో ఉంది. ఈ జ్యోతిర్లింగం గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని వెరావల్ ఓడరేవు సమీపంలో ఉంది. సోమనాథ్ జ్యోతిర్లింగానికి హిందూ మతంలో చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

ఈ జ్యోతిర్లింగాన్ని చంద్రుడు స్వయంగా నిర్మించాడని ఒక నమ్మకం. సోమనాథ ఆలయంలో శివుడిని ప్రత్యేక పూజలతో పూజిస్తారు. సోమనాథుడు అంటే ‘సోమ ప్రభువు’. సోమ అంటే చంద్రుడు , నాథ అంటే ప్రభువు, కనుక సోమనాథ అంటే చంద్రునికి ప్రభువు అని అర్ధం. ఈ దేవాలయం శివుడు సమస్త సృష్టికి ఆధారమని,  సమస్త జీవరాశిని పోషించేవాడని ప్రతీకాత్మకంగా చూపిస్తుంది.

సోమనాథ జ్యోతిర్లింగం.. మతపరమైన ప్రాముఖ్యత

ఇవి కూడా చదవండి

సోమనాథ జ్యోతిర్లింగం గురించి శివపురాణం, స్కంద పురాణం, ఇతర పవిత్ర గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో దీనికి ప్రథమ స్థానం లభించింది. సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శనంతోనే భక్తులు మోక్షాన్ని పొందుతారని.. పాపాలు నశిస్తాయని నమ్ముతారు. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించడం ద్వారా శివుని ఆశీస్సులతో పాటు పార్వతి దేవి ఆశీస్సులు లభిస్తాయి.

సోమనాథ ఆలయం ప్రధాన పురాణం

పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. ఈ కుమార్తెలకు భర్త చంద్రుడు.  అయితే తన భార్యలందరి కంటే రోహిణిపై ప్రత్యేక అభిమానం చూపించేవాడు చంద్రుడు. దీని కారణంగా మిగిలిన 26 మంది భార్యలు నిర్లక్ష్యం  చేయబడ్డారు. అవమానించబడ్డారు . దీంతో ఆ 26 మంది కుమార్తెలు తమ తండ్రి దక్షుడు దగ్గరకు వెళ్లి తమ భర్త తీరుని గురించి ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న దక్ష ప్రజాపతి తన 26 మంది కుమార్తెల గురించి చాలా బాధపడ్డాడు. అల్లుడైన చంద్రుడిని అందరిని ఒకే విధంగా చూడామని చెప్పి ఒప్పించేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. అప్పుడు దక్షుడికి కోపం వచ్చి చంద్రుని కీర్తి క్రమంగా బలహీనపడుతుందని శపించాడు.

చంద్రుని తపస్సు

మామ దక్ష ప్రజాపతి ఇచ్చిన శాపం కారణంగా చంద్రుని ప్రకాశం తగ్గడం ప్రారంభించి తీవ్ర దుఃఖానికి లోనయ్యాడు. శాపం నుండి విముక్తి  కోసం చంద్రుడు బ్రహ్మదేవుని సలహాతో, గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని  సముద్ర తీరానికి వెళ్లి శివలింగాన్ని ప్రతిష్టించి పూజించి, శివుని గురించి తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. చంద్రుని తపస్సుకు సంతోషించిన శివుడు ప్రత్యక్షమై చంద్రుడికి దక్షుడు రాజు శాపం నుండి విముక్తిని కలిగించాడు. చంద్రుడికి అమరత్వం అనే వరం ఇచ్చాడు.

శివుని పేరు “సోమనాథుడు”

చంద్రుడిపై అనుగ్రహము చూపిన శివుడు .. ప్రతి 15 రోజులకు చంద్రుడు క్షీణించడం, మళ్లీ పౌర్ణమి రూపంలో తిరిగి ప్రకాశిస్తాడని  చెప్పాడు. అప్పటి నుండి శివుడిని “సోమ్‌నాథుడు” అని పిలుస్తారు.

జ్యోతిర్లింగ స్థాపన

శాపం నుండి విముక్తి పొందిన తరువాత చంద్రుడు తాను చేసిన శివలింగంలో నివసించమని శివుడిని ప్రార్థించాడని చెబుతారు. శివుడు చంద్రుని ప్రార్థనను అంగీకరించి ఆ శివలింగంలో ఇక్కడ భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అప్పటి నుండి ఈ శివలింగాన్ని సోమనాథ జ్యోతిర్లింగంగా పూజించడం ప్రారంభించారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు