AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: తెలుగువారి కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ.. చౌకగా జ్యోతిర్లింగాల సహా అనేక ప్రదేశాలను సందర్శించండి.

మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. దీంతో పుణ్యం పురుషార్ధం కలిసి వచ్చేలా ఆధ్యాత్మిక పర్యటన.. అందులో అందమైన ప్రాంతాలను దర్శనం చేసుకోవాలని భావిస్తారు. ముఖ్యంగా ఏదైనా జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలని కోరుకునే తెలుగు వారి కోసం IRCTC ఒక స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకుని వచ్చింది. అందులోనూ ఈ టూర్ ప్యాకేజీని తక్కువ ధరకే అందిస్తున్న నేపధ్యంలో రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శింసుకోవడమే కాదు.. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు.

IRCTC: తెలుగువారి కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ.. చౌకగా జ్యోతిర్లింగాల సహా అనేక ప్రదేశాలను సందర్శించండి.
Divya Dakshin Yatra
Surya Kala
|

Updated on: Jul 20, 2024 | 11:48 AM

Share

ప్రకృతి ప్రేమికులకు వర్షాకాలం అంటే ఇష్టం.. ఈ సమయంలో పచ్చదనంతో నిండిన ప్రకృతి కనులకు విందు చేస్తుంది. దీంతో చాలా మంది వర్షాకాలం రాగానే వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి ఆసక్తిని చూపిస్తారు. కొంత మంది కుటుంబ సమేతంగా వెళ్తే, మరికొందరు జంటలుగా ఈ సీజన్‌లో సరదాగా విహారయాత్ర చేయాలనుకుంటారు. ప్రస్తుతం మరికొద్ది రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. దీంతో పుణ్యం పురుషార్ధం కలిసి వచ్చేలా ఆధ్యాత్మిక పర్యటన.. అందులో అందమైన ప్రాంతాలను దర్శనం చేసుకోవాలని భావిస్తారు. ముఖ్యంగా ఏదైనా జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవాలని కోరుకునే తెలుగు వారి కోసం IRCTC ఒక స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకుని వచ్చింది. అందులోనూ ఈ టూర్ ప్యాకేజీని తక్కువ ధరకే అందిస్తున్న నేపధ్యంలో రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శింసుకోవడమే కాదు.. దక్షిణ భారతదేశంలోని అనేక ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. ఈ నేపధ్యంలో ఈ రోజు IRCTC అందిస్తున్న టూర్ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర

IRCTC ఆయా సీజన్లను దృష్టిలో పెట్టుకుని పర్యటకులకు సౌకర్యాలను కల్పిస్తూ ఎల్లప్పుడూ కొన్ని స్పెషల్ టూర్ ప్యాకేజీలను తీసుకుని వస్తుంది. అటువంటి పరిస్థితిలో IRCTC ఈసారి వర్షాకాలంలో పర్యటనకు వీలయ్యే విధంగా ఒక పర్యాటక ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ టూర్ ప్యాకేజీలో వెళ్ళేవారు కన్యాకుమారి, తంజావూరు, త్రివేండ్రం, రామేశ్వరం, మధురై, తిరువణ్ణామలై వంటి ప్రదేశాలను సందర్శించవచ్చు. అనేకాదు అనేక ఇతర ప్రదేశాలను సందర్శించడంతోపాటు రెండు జ్యోతిర్లింగ క్షేత్రాల దర్శనం కూడా చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఎన్ని రోజుల ప్రయాణం అంటే

ఈ మొత్తం ప్యాకేజీ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ప్రయాణించవలసి ఉంటుంది. సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభం కానుంది. IRCTC జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర మొతం తొమ్మిది రోజులు సాగనుంది. అంటే ఈ టూర్ లో 8 రాత్రులు, 9 పగళ్ల ప్రయాణాన్ని చేయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక పర్యటన 4 ఆగస్టు 2024 నుంచి ప్రారంభం కానుందని IRCTC ప్రకటించింది.

చౌకైన టూర్ ప్యాకేజీ

ఈ టూర్ ప్యాకేజీ మొత్తం చాలా చౌకగా పర్యాటకులకు అందిస్తోంది. ఎకానమీ క్లాస్ టికెట్ బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.14,250 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కనుక బుకింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఉచితంగాఏఏ సౌకర్యాలు కల్పించనున్నది అంటే

ఈ మొత్తం పర్యటనలో ఆహారం, వసతి, అల్పాహారం, ప్రతిదీ ఈ టికెట్ పెయిర్ లో కవర్ చేయబడుతుంది. ఈ టూర్ ప్యాకేజీతో ప్రయాణిస్తే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. శ్రావణ మాసంలో రెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. అదే సమయంలో దక్షిణాదిలోని అనేక అందమైన చరిత్రాత్మకమైన ప్రదేశాలను సందర్శించవచ్చు. తొమ్మిది రోజుల టూర్ పూర్తీ చేసిన అనంతరం మీరు ఏ స్టేషన్ లో ఎక్కారో అక్కడే మిమ్మల్ని క్షేమంగా దింపుతారు.

ఎలా బుక్ చేసుకోవాలంటే తక్కువ ధరతో ప్రకటించిన ఈ టూర్ ప్యాకేజీని ఇష్టపడితే .. సౌత్ టూర్‌కు వెళ్లాలనుకుంటే ఈ నంబర్‌లో 9281495845 లేదా 9701360701ను సంప్రదించవచ్చు. లేదా IRCTC www.irctctourism.com అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించడం ద్వారా మీరు ఈ టూర్ ప్యాకేజీ గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు .

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..