AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: 32 పళ్లతో జన్మించిన చిన్నారి.. ఇది జోక్ కాదంటున్న శిశివు తల్లి..

అయితే పిల్లలకు సాధారణంగా ఆరు నెలల నుంచి 12 నెలల మధ్య దంతాలు రావడం ప్రారంభిస్తాయి. అయితే పూర్తిగా దంతాలు రావడానికి చాలా సంవత్సరాలు పడతాయి. అయితే ఎవరినా శిశివు 32 పళ్ళతో పుడితే? నమ్మశక్యం కాని విషయంగా అనుకుంటారు కదా.. అయితే అమెరికాకు చెందిన ఓ మహిళ ఇదే తరహాలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వీడియో చూసిన జనాలు ఉలిక్కిపడ్డారు. ఇది చాలా అరుదైన సంఘటన అని వైద్యులు చెబుతున్నారు.

Viral News: 32 పళ్లతో జన్మించిన చిన్నారి.. ఇది జోక్ కాదంటున్న శిశివు తల్లి..
Baby Born With Full Set Of TeethImage Credit source: Instagram/@ika.diwa
Surya Kala
|

Updated on: Jul 20, 2024 | 12:16 PM

Share

దంపతులకు తాము తల్లిదండ్రులం కానున్నాం అనే వార్త విన్నప్పటి నుంచి శిశివు జననం కోసం ఎదురు చూస్తారు. బిద పుట్టిన క్షణం నుంచి ప్రతి రోజూ ఆ చిన్నారి చేసే పనులను గుర్తు చేసుకుంటూ మురిసిపోతారు. నవ్వడం, మాటలకు ఊకోట్టడం, అమ్మ అనే పిలుపు, బుడి బుడి అడుగులు వేయడం, పాకడం, పళ్ళు రావడం ఇలా ఒకటేమిటి ప్రతి ఒక్క సందర్భం ఒక గొప్ప జ్ఞాపకమే.. అయితే పిల్లలకు సాధారణంగా ఆరు నెలల నుంచి 12 నెలల మధ్య దంతాలు రావడం ప్రారంభిస్తాయి. అయితే పూర్తిగా దంతాలు రావడానికి చాలా సంవత్సరాలు పడతాయి. అయితే ఎవరినా శిశివు 32 పళ్ళతో పుడితే? నమ్మశక్యం కాని విషయంగా అనుకుంటారు కదా.. అయితే అమెరికాకు చెందిన ఓ మహిళ ఇదే తరహాలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వీడియో చూసిన జనాలు ఉలిక్కిపడ్డారు. ఇది చాలా అరుదైన సంఘటన అని వైద్యులు చెబుతున్నారు. దీనిని నియోనాటల్ పళ్ళు లేదా నేటల్ దంతాలు అంటారు.

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్‌లో నివసిస్తున్న నికా దివా అనే మహిళ తన నవజాత శిశువుకి ఎదురైన అరుదైన పరిస్థితి గురించి అవగాహన కల్పించడానికి టిక్‌టాక్ సహాయం తీసుకుంది. తన కూతురు దంతాలతో పుట్టిందని చెప్పింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను కూడా షేర్ చేసింది ఆ శిశివు తల్లి. అందులో పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఉన్న అమ్మాయి చిత్రాలున్నాయి.

నికా దివా చెప్పిన ప్రకారం తన కుమార్తెను మొదటిసారి చేతిలోకి తీసుకున్నప్పుడు తన చిన్నారి నోటిలోని అన్ని పళ్ళను చూసి షాక్ తింది. ఇది చాలా అరుదైన వ్యాధి అని.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దీనిపై అవగాహన కల్పించే పనిలో ఉన్నామని వైద్యులు ఆమెకు చెప్పారు. ఇది జోక్ కాదని ఆ మహిళ చెప్పింది. చాలా మంది ఈ పోస్ట్‌ను సీరియస్‌గా తీసుకోవాలని కామెంట్ చేయగా.. కొంతమంది మాత్రం ఇలాంటి సంఘటలు కూడా జరగవచ్చు నమ్మారు. @ika.diwa Insta ఖాతాలో షేర్ చేసిన వీడియో క్లిప్ని ఇప్పటికే మూడు కోట్ల మందికి పైగా చూశారు.

ఇవి కూడా చదవండి

ncbi.nlm.nih.gov ప్రకారం ఇలా జన్మించడానికి అనేక కారణాలు ఉండవచ్చు అని అంటున్నారు. జన్యుపరమైన అంశాలు, కొన్ని వైద్య పరిస్థితులు లేదా గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్య పరిస్థితి వంటివి కారణాలు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ పరిస్థితి తరచుగా శిశువుకు ఎటువంటి తీవ్రమైన సమస్యను కలిగించకపోయినా.. దంతాలు ఊడిపోతే వాటిని ఆ శిశివు మింగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతేకాదు తల్లి పాలివ్వడంలో ఇబ్బందిని ఎదుర్కొంటుందని అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..