AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton Korma: మటన్ కూర్మా ఇలా చేశారంటే.. టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది..

మటన్ అంటే చాలా మందికి ఇష్టం. మటన్ కాస్త ధర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెండు వారాలకు ఒకసారైనా తెచ్చుకుని తింటూ ఉంటారు. ఇంట్లో మటన్‌ చేస్తే సాధారణంగా ఒకలానే ఇగురు చేస్తూ ఉంటారు. కానీ ఈ సారి కాస్త వెరైటీగా ట్రై చేయండి. ఒక్కసారి మటన్ కూర్మా ట్రై చేయండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. సులభంగానే వంట కూడా అయిపోతుంది. ఈ కర్రీ బిర్యానీ, రైస్, చపాతీలు, రోటీలు వేటితో తిన్నా..

Mutton Korma: మటన్ కూర్మా ఇలా చేశారంటే.. టేస్ట్ మరింత రెట్టింపు అవుతుంది..
Mutton Korma
Chinni Enni
|

Updated on: Jul 25, 2024 | 7:40 PM

Share

మటన్ అంటే చాలా మందికి ఇష్టం. మటన్ కాస్త ధర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెండు వారాలకు ఒకసారైనా తెచ్చుకుని తింటూ ఉంటారు. ఇంట్లో మటన్‌ చేస్తే సాధారణంగా ఒకలానే ఇగురు చేస్తూ ఉంటారు. కానీ ఈ సారి కాస్త వెరైటీగా ట్రై చేయండి. ఒక్కసారి మటన్ కూర్మా ట్రై చేయండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. సులభంగానే వంట కూడా అయిపోతుంది. ఈ కర్రీ బిర్యానీ, రైస్, చపాతీలు, రోటీలు వేటితో తిన్నా చాలా బాగుంటుంది. మరి ఈ మటన్ కూర్మా ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మటన్ కూర్మా రెసిపీకి కావాల్సిన పదార్థాలు:

మటన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, గసగసాలు, కొబ్బరి తురుము, పెరుగు, వెచ్చని పాలు, కుంకుమ పువ్వు, బాదం పప్పులు, కొత్తి మీర, కరివేపాకు, ఆయిల్.

మటన్ కూర్మా రెసిపీ తయారీ విధానం:

ఈ కర్రీ తయారు చేయడానికి బోన్ లెస్ మటన్ తీసుకోవాలి. మటన్ శుభ్రంగా కడిగి.. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోనే పెరుగు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి, పెరుగు, జీరా పొడి, ధనియా పొడి వేసి బాగా కలిపి ఓ గంట పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. ముందుగా గసగసాలను నానబెట్టి.. మిక్సీలో వేయాలి. ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి మెత్తగా పేస్ట్‌ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి.. వేడెక్కాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇవి కాస్త రంగు మారాక టమాటా ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇవి మెత్తబడ్డాక.. మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా వేసి బాగా కలుపు కోవాలి.

ఇవి కూడా చదవండి

పైన మూత పెట్టి పది నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత గసగసాల పేస్ట్ వేసి మరో దు నిమిషాలు కలపాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, కరివేపాకు వేసి ఓ ఐదు నిమిషాలు వేగాక వాటర్ వేసి మూత పెట్టి పావు గంట ఉడికించాలి. ఆ నెక్ట్స్ గోరు వెచ్చటి పాలలో కుంకుమ పువ్వు వేసి కలిపి.. మటన్‌లో వేయాలి. నానబెట్టిన బాదం పప్పును మిక్సీ పట్టి పేస్టు కూడా వేసి ఓ ఉడుకు రానివ్వాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర చల్లి ఓ ఐదు నిమిషాలు ఉడికించాక స్టవ్ ఆఫ్ చేయడమే. అంతే ఎంతో రుచిగా ఉండే మటన్ కూర్మా సిద్ధం.

Follow Us
అడ్వాన్స్ తీసుకొని సుతారి పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
ఆనాటి గ్లామర్ సంచలనం దీప ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..?
ఆనాటి గ్లామర్ సంచలనం దీప ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..?