Milk Powder Burfi: మిల్క్ పౌడర్‌తో టేస్టీ బర్ఫీ.. నోట్లే వేస్తే కరిగి పోతుంది..

చాలా మంది బర్ఫీలను ఇష్ట పడి తింటూ ఉంటారు. వీటి కోసం ప్రత్యేకంగా షాపుకు వెళ్లి కొని తెచ్చుకుంటూ ఉంటారు. అందులోనూ ఇంట్లో పిల్లలు ఉన్నారంటే.. వాళ్లు మరింత ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇవి తియ్యగా, రుచిగా ఉంటాయి. అయితే ఇకపై వీటిని షాపుకు వెళ్లి తెచ్చుకోకుండా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అందులోనూ అందరికీ సులభంగా దొరికే మిల్క్ పౌడర్‌తో ఈ బర్ఫీలు తయారు చేస్తే ఇంకా రుచిగా ఉంటాయి. వీటిని నోట్లో వేస్తే..

Milk Powder Burfi: మిల్క్ పౌడర్‌తో టేస్టీ బర్ఫీ.. నోట్లే వేస్తే కరిగి పోతుంది..
Milk Powder Burfi
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 05, 2024 | 9:57 PM

చాలా మంది బర్ఫీలను ఇష్ట పడి తింటూ ఉంటారు. వీటి కోసం ప్రత్యేకంగా షాపుకు వెళ్లి కొని తెచ్చుకుంటూ ఉంటారు. అందులోనూ ఇంట్లో పిల్లలు ఉన్నారంటే.. వాళ్లు మరింత ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇవి తియ్యగా, రుచిగా ఉంటాయి. అయితే ఇకపై వీటిని షాపుకు వెళ్లి తెచ్చుకోకుండా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అందులోనూ అందరికీ సులభంగా దొరికే మిల్క్ పౌడర్‌తో ఈ బర్ఫీలు తయారు చేస్తే ఇంకా రుచిగా ఉంటాయి. వీటిని నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి. పిల్లల బర్త్‌డేలకు కూడా తయారు చేసి పిల్లలకు పంచవచ్చు. వీటిని చాలా తక్కువ ఐటెమ్స్‌‌తో సులభంగా ప్రిపేర్ చేయవచ్చు. మరి ఈ టేస్టీ మిల్క్ పౌడర్ బర్ఫీలు ఎలా తయారు చేస్తారు. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిల్క్ పౌడర్ బర్ఫీలకు కావాల్సిన పదార్థాలు:

పాల పొడి, పాలు, పంచదార, యాలకుల పొడి, నెయ్యి, డ్రై ఫ్రూట్స్.

మిల్క్ పౌడర్ బర్ఫీలు తయారీ విధానం:

ముందుగా వీటిని తయారు చేయడానికి మందంగా ఉండే గిన్నెలు తీసుకోవాలి. నాన్ స్టిక్ పాన్స్ ఉన్నా పర్వాలేదు. స్టవ్ వెలిగించి.. అందులో ఒక కప్పు పాలు, ఒక స్పూన్ నెయ్యి వేసి సిమ్‌లో మరిగించాలి. ఇవి మరిగాక.. ఇందులోనే రెండు కప్పుల పాల పొడిని వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. నెయ్యి వేస్తే పిండి త్వరగా కలిసి పోతుంది. ఈ పాల పొడిని ఓ ఐదు నిమిషాల వరకు ఉడక నివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ గిన్నెకు అంటుకోకుండా చూడాలి.

ఇవి కూడా చదవండి

పాల పొడి కాస్త ఉడికా మళ్లీ ఒక స్పూన్ నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండి చలిమిడి మాదిరిగా దగ్గర పడాలి. పిండి చేతికి అంటుకోకుండా ఉంటే పిండి తయారైనట్టు. లేదంటే మళ్లీ కాసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ పిండి నెయ్యి లేదా ఆయిల్ రాసిన ఓ ప్లేట్‌లోకి తీసుకోవాలి. పైన సన్నగా కట్ చేసిన డ్రై ప్రూట్స్ చల్లుకోవాలి. ఇలా ఓ రెండు, మూడు గంటలు పక్కన పెడితే పాల పౌడర్ బర్ఫీ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతాయి.

సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్.. రీ రిలీజ్ లతో నే సరిపెట్టుకోవాల్సిందేనా
సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్.. రీ రిలీజ్ లతో నే సరిపెట్టుకోవాల్సిందేనా
సచిన్ స్నేహితుడికి ఏమైంది?నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ..వీడియో
సచిన్ స్నేహితుడికి ఏమైంది?నడవలేని స్థితిలో వినోద్ కాంబ్లీ..వీడియో
రేర్ రికార్డుకు ట్రై చేస్తున్న తమన్నా, రష్మిక..
రేర్ రికార్డుకు ట్రై చేస్తున్న తమన్నా, రష్మిక..
చూస్తుండగానే ఆవిరైపోయిన ఇన్వెస్టర్ల సంపద
చూస్తుండగానే ఆవిరైపోయిన ఇన్వెస్టర్ల సంపద
తారక్‌ నయా సెంటిమెంట్‌.. ప్లానింగ్‌ అదిరిందిగా..
తారక్‌ నయా సెంటిమెంట్‌.. ప్లానింగ్‌ అదిరిందిగా..
ఎండు ద్రాక్షను వీళ్లు మాత్రం అస్సలు తిన కూడదట..!తప్పక తెలుసుకోండి
ఎండు ద్రాక్షను వీళ్లు మాత్రం అస్సలు తిన కూడదట..!తప్పక తెలుసుకోండి
మిల్క్ పౌడర్‌తో టేస్టీ బర్ఫీ.. నోట్లే వేస్తే కరిగి పోతుంది..
మిల్క్ పౌడర్‌తో టేస్టీ బర్ఫీ.. నోట్లే వేస్తే కరిగి పోతుంది..
బంగ్లాదేశ్‌ అనిశ్చితిపై మోదీ ఉన్నత స్థాయి సమావేశం..
బంగ్లాదేశ్‌ అనిశ్చితిపై మోదీ ఉన్నత స్థాయి సమావేశం..
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..
తాటిచెట్టు పై ఉరేసుకున్న వృద్ధుడు.. మృ**తదేహాన్ని దించుతుండగా..
స్కూల్‌కి వెళ్లే మూడ్ లేక బాలుడు ఏం చేశాడో తెలిస్తే
స్కూల్‌కి వెళ్లే మూడ్ లేక బాలుడు ఏం చేశాడో తెలిస్తే