Vegetable Fried Rice: లంచ్ బాక్స్ కోసం సింపుల్‌గా, ఫాస్ట్‌గా వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్..

స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభం అయ్యాయి. మరోవైపు ఉద్యోగాలకు వెళ్లే మహిళలు కూడా ఉంటారు. ఈ క్రమంలో ఉదయం చాలా హడావిడిగా ఉంటుంది. ఇలాంటి టైమ్‌లో టేస్టీగా, ఫాస్ట్‌గా అయ్యే రెసిపీలు చాలా తక్కువగా ఉంటాయి. ఏదో కంగారుగా వండుతూ ఉంటారు. కానీ అది అంతగా రుచిగా ఉండదు. అందులోనూ పిల్లలు అస్సలు తినరు. ఇలాంటి సమయంలో మీ కోసమే ఓ స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాం. ఇది ఎంతో రుచిగా ఉండటమే..

Vegetable Fried Rice: లంచ్ బాక్స్ కోసం సింపుల్‌గా, ఫాస్ట్‌గా వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్..
Vegetable Fried Rice
Follow us
Chinni Enni

|

Updated on: Aug 05, 2024 | 8:34 PM

స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభం అయ్యాయి. మరోవైపు ఉద్యోగాలకు వెళ్లే మహిళలు కూడా ఉంటారు. ఈ క్రమంలో ఉదయం చాలా హడావిడిగా ఉంటుంది. ఇలాంటి టైమ్‌లో టేస్టీగా, ఫాస్ట్‌గా అయ్యే రెసిపీలు చాలా తక్కువగా ఉంటాయి. ఏదో కంగారుగా వండుతూ ఉంటారు. కానీ అది అంతగా రుచిగా ఉండదు. అందులోనూ పిల్లలు అస్సలు తినరు. ఇలాంటి సమయంలో మీ కోసమే ఓ స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాం. ఇది ఎంతో రుచిగా ఉండటమే కాకుండా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. పైగా అందరికీ నచ్చుతుంది. అదే వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్. మరి ఈ రైస్ ఐటెమ్ ఎలా తయారు చేస్తారు? ఈ వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

బియ్యం, మీల్ మేకర్, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, పచ్చి మిర్చి, ఉల్లియాలు, బీన్స్, బటానీలు, వెల్లుల్లి, సోయా సాస్, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి, ఆయిల్.

వెజిటెబుల్ ఫ్రైడ్ రైస్‌ తయారీ విధానం:

ముందుగా కూరగాయలన్నింటినీ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బటానీలు కూడా నాన బెట్టుకోవాలి. ఆ తర్వా బియ్యాన్ని కూడా కడిగి ఓ అరగంట ముందు నాన బెట్టి.. రైస్‌గా వండి పక్కన ఉంచాలి. ఇప్పుడు ఓ కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ముందుగా వెల్లుల్లిని సన్నగా కట్ చేసి వేయాలి. ఇవి వేగాక.. కూరగాయలన్నింటినీ వేసి ఓ పది నిమిషాలు వేయించాలి. ఇవి సగం ఉడికితే చాలు. నెక్ట్స్ ఇందులోనే సోయాసాస్ కొద్దిగా, ఒక స్పూన్ వెనిగర్, పంచదార వేసి కలపాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత పచ్చి మిర్చి, మిరియాల పొడి వేసి మరోసారి కలిపి.. ఇందులో ముందుగా వండి పెట్టుకున్న అన్నం వేయాలి. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. కావాలి అనుకుంటే చివరిలో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే లంచ్ బాక్స్‌లోకి వెరైటీగా, టేస్టీగా ఉండే వెటిటెబుల్ ఫ్రైడ్ రైస్ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే