ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, ఫైబర్, ప్రొటీన్, క్యాల్షియం వంటి పోషకాలు లభిస్తాయి. బరువు తగ్గాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఎక్కువ ఎండుద్రాక్షకు దూరంగా ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిని తింటే బరువు పెరుగుతారు. ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఎండుద్రాక్షలో సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. కాబట్టి.. దాని పరిమాణాన్ని పరిమితంగా ఉండాలని అంటున్నారు.