- Telugu News Photo Gallery Technology photos Realme launches best ear buds with AI noise cancellation realme buds t310 price and features
Realme: రియల్‌మీ నుంచి స్టన్నింగ్ ఇయర్ బడ్స్.. బయట ఎన్ని శబ్ధాలు వచ్చినా..
ప్రస్తుతం వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇయర్ బడ్స్ కొనుగోలు చేసే ముందే చూడాల్సిన ప్రధాన అంశాల్లో వాయిస్ క్యాన్సిలేషన్. ఈ ఫీచర్ ఉన్న ఇయర్ బడ్స్ మంచి అనుభూతిని అందిస్తాయి. తాజాగా ఇలాంటి ఫీచర్‌తోనే మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్ వచ్చింది..
Updated on: Aug 05, 2024 | 8:20 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ భారత మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. రియల్ బడ్స్ టీ310 పేరుతో తీసుకొచ్చిన ఈ ట్రూలీ వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌లో అధునాతన ఫీచర్లను తక్కవ ధరలోనే తీసుకొచ్చారు.

ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 12.4mm డైనమిక్ బాస్ డ్రైవర్‌లు, AI-బ్యాక్డ్ ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) సపోర్ట్‌ను ఇచ్చారు. ఈ ఇయర్ బడ్స్ గరిష్టంగా 46dB హైబ్రిడ్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో పాటు 360-డిగ్రీల సౌండ్ అనుభవాన్ని అందిస్తాయి. దీంతో నాణ్యమైన వాయిస్‌ను వినొచ్చు.

ఇక ఈ ఇయర్ బడ్స్‌ను రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే డ్యూయల్ డివైజ్ కనెక్టింగ్ ఆప్షన్‌తో తీసుకొచ్చారు. ఛార్జింగ్ విషయానికొస్తే చార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 40 గంటల వరకు పవర్ బ్యాకప్ లభిస్తుంది. ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఆన్‌లో ఉంటే, 26 గంటల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది.

ఈ ఇయర్‌బడ్స్‌ను కేవలం 10 నిమిషాల చార్జ్‌తో 5 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తాయని కంపెనీ చెబుతోంది. ఇక ఇందులో స్మార్ట్ టచ్ కంట్రోలింగ్ ఫీచర్‌ను అందించారు. ఆగస్టు 5వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభమయ్యాయి.

అలాగే వీటిలో దుమ్ము, నీటి నుంచి ప్రొటెక్షన్ కోసం ఐపీ55 రేటింగ్‌ను ఇచ్చారు. ఎజైల్ వైట్, మోనెట్ పర్పుల్, వైబ్రంట్ బ్లాక్ కలర్స్‌లో తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే ఈ ఇయర్ బడ్స్ రూ. 2499కి అందుబాటులో ఉన్నాయి.




