Mango Pakodi: పచ్చి మామిడికాయతో పకోడీలు చేసుకుంటే.. భలేగా ఉంటాయి!

సాయంత్రం అయ్యిందంటే చాలు ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఎవరి వీలును బట్టి వాళ్లు వెరైటీలు తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువగా చాలా మంది పకోడీలనే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది చాలా క్విక్ గా అయిపోయే ఐటెమ్. పకోడీలు వేటితో వేసుకున్నా చాలా రుచిగా ఉంటాయి. వాటిల్లో పచ్చి మామిడి కూడా ఒకటి. మామిడి పండుతో ఎన్నో రకాల వంటలు, జ్యూసులు..

Mango Pakodi: పచ్చి మామిడికాయతో పకోడీలు చేసుకుంటే.. భలేగా ఉంటాయి!
Mango Pakodi
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 09, 2024 | 9:30 PM

సాయంత్రం అయ్యిందంటే చాలు ఏదో ఒకటి తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఎవరి వీలును బట్టి వాళ్లు వెరైటీలు తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువగా చాలా మంది పకోడీలనే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది చాలా క్విక్ గా అయిపోయే ఐటెమ్. పకోడీలు వేటితో వేసుకున్నా చాలా రుచిగా ఉంటాయి. వాటిల్లో పచ్చి మామిడి కూడా ఒకటి. మామిడి పండుతో ఎన్నో రకాల వంటలు, జ్యూసులు తయారు చేసుకుంటాం. కానీ పచ్చి మామిడి పండుతో పకోడీ కూడా వేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా. ఇది పుల్లగా, కారంగా చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ పచ్చి మామిడితో పకోడీ ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పచ్చి మామిడి పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు:

పచ్చి మామిడి పండు, శనగ పిండి, ఉప్పు, కారం, కొత్తి మీర, పసుపు, జీలకర్ర, ఆయిల్.

పచ్చి మామిడి పకోడీ తయారీ విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ లోపు పచ్చి మామిడిని తీసుకుని శుభ్రంగా కడిగి.. తొక్కు తీసి సన్నగా తురుము కోవాలి. ఇప్పుడు ఈ తురుమును ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో శనగ పిండి, ఉప్పు, కారం, కొత్తి మీర, పసుపు, జీలకర్ర అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కావాల్సిన వాళ్లు ఉల్లిపాయలు, పచ్చి మిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఇవన్నీ కలిపి.. కావాలంటే నీళ్లు కూడా పోసి.. పకోడీ మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మరుగుతున్న నూనెలో.. పకోడీల్లా వేసుకోవాలి. మీడియం మంట మీద వీటిని వేయించాలి. పకోడీ బాగా వేగా.. సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పచ్చి మామిడి పకోడీ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.