Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jonna khichdi: టేస్టీ అండ్ హెల్దీ జొన్న కిచిడి.. ఇలా చేస్తే అమృతమే..

ప్రస్తుతం ఇప్పుడున్న అనారోగ్య సమస్యల కారణంగా చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం తినేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా రకాల హెల్దీ రెసిపీల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరో హెల్దీ అండ్ టేస్టీ మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేశాం. జొన్నల గురించి చాలా మందికి తెలుసు. ఇవి కూడా మిల్లెట్స్‌లో ఓ భాగమే. జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది. జొన్నలతో చాలా రకాల ఆహారాలు తయారు చేసుకోవచ్చు. అలాగే జొన్నలతో తయారు చేసుకునే వాటిల్లో..

Jonna khichdi: టేస్టీ అండ్ హెల్దీ జొన్న కిచిడి.. ఇలా చేస్తే అమృతమే..
Jonna Khichdi
Chinni Enni
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Jul 09, 2024 | 10:00 PM

Share

ప్రస్తుతం ఇప్పుడున్న అనారోగ్య సమస్యల కారణంగా చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం తినేందుకు మక్కువ చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా రకాల హెల్దీ రెసిపీల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరో హెల్దీ అండ్ టేస్టీ మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేశాం. జొన్నల గురించి చాలా మందికి తెలుసు. ఇవి కూడా మిల్లెట్స్‌లో ఓ భాగమే. జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది. జొన్నలతో చాలా రకాల ఆహారాలు తయారు చేసుకోవచ్చు. అలాగే జొన్నలతో తయారు చేసుకునే వాటిల్లో జొన్న కిచిడీ కూడా ఒకటి. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. మరి ఈ జొన్న కిచిడి ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జొన్న కిచిడీకి కావాల్సిన పదార్థాలు:

జొన్న రవ్వ, శనగపప్పు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, క్యారెట్, పచ్చి బఠాణి, మిరియాల పొడి, కరివేపాకు, కొత్తిమీర తరుగు, జీలకర్ర, ఆయిల్, ఉప్పు, వెల్లుల్లి తరుగు.

జొన్న కిచిడీ తయారీ విధానం:

ముందుగా జొన్న రవ్వ, పచ్చి శనగపప్పు, ఉప్పు వేసి సుమారు ఐదు విజిల్స్ వచ్చేంత వరకూ కుక్కర్‌లో ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి చల్లారేంత వరకూ పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక.. జీలకర్ర, వెల్లుల్లి తరుగు, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఆ నెక్ట్స్, ఉల్లిపాయలు, పచ్చి మర్చి, క్యారెట్, పచ్చి బఠాణి ఒకదాని తర్వాత వేసి ఎర్రగా వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఇవి వేగుతున్నప్పుడు మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఇవన్నీ బాగా వేగాక.. ముందుగా కుక్కర్‌లో ఉడికించుకున్న మిశ్రమాన్ని కూడా వేసి కలపాలి. అంతే ఎంతో రుచిగా ఉండే జొన్న కిచిడీ పది నిమిషాల్లో సిద్ధం అయిపోతుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా, డిన్నర్‌గా తీసుకోవచ్చు. లంచ్ బాక్స్‌లో కూడా పెట్టి ఇవ్వొచ్చు. జొన్న కిచిడీ తినడం ఎంతో ఆరోగ్యకరం.

ఫిష్ వెంకట్ కూతురికి వీడియో కాల్ చేసి భరోసా ఇచ్చిన టాలీవుడ్ హీరో
ఫిష్ వెంకట్ కూతురికి వీడియో కాల్ చేసి భరోసా ఇచ్చిన టాలీవుడ్ హీరో
విమానం గాల్లో ఉండగానే ఇంజన్‌లో చెలరేగిన మంటలు.. టేకాఫ్ అయిన..
విమానం గాల్లో ఉండగానే ఇంజన్‌లో చెలరేగిన మంటలు.. టేకాఫ్ అయిన..
ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?సిద్ధార్థ్‌తో బ్లాక్ బస్టర్
ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?సిద్ధార్థ్‌తో బ్లాక్ బస్టర్
సెల్ఫీ వీడియో తీసుకొని ఉపాధ్యాయుడు ఆత్మహత్య..
సెల్ఫీ వీడియో తీసుకొని ఉపాధ్యాయుడు ఆత్మహత్య..
ఒకే రోజులో 2సార్లు ఆలౌట్.. మాంచెస్టర్‌లో టీమిండియా చెత్త రికార్డ్
ఒకే రోజులో 2సార్లు ఆలౌట్.. మాంచెస్టర్‌లో టీమిండియా చెత్త రికార్డ్
వైసీపీ నేత ముద్రగడకు తీవ్ర అస్వస్థత.. విషమంగానే ఆరోగ్యం..
వైసీపీ నేత ముద్రగడకు తీవ్ర అస్వస్థత.. విషమంగానే ఆరోగ్యం..
Thai Airlines: థాయ్‌ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పిందా?..
Thai Airlines: థాయ్‌ విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పిందా?..
విమానం గాల్లో ఉండగానే.. డోర్‌ తెరిచే ప్రయత్నం!
విమానం గాల్లో ఉండగానే.. డోర్‌ తెరిచే ప్రయత్నం!
బాల్-అవుట్ నియమం ఎలా పనిచేస్తుంది?
బాల్-అవుట్ నియమం ఎలా పనిచేస్తుంది?
సోనూసూద్ ఇంటి ఆవరణలోకి పాము.. రియల్ హీరో ఏం చేశాడో తెలుసా? వీడియో
సోనూసూద్ ఇంటి ఆవరణలోకి పాము.. రియల్ హీరో ఏం చేశాడో తెలుసా? వీడియో