AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malai Malpua: జన్మాష్టమి రోజున ఈ మలాయీ మాల్పువా చేయండి.. అదిరిపోతుంది..

జన్మాష్టమి రోజున ప్రత్యేకమైన స్వీట్ ఉండాలి. ఎప్పుడూ ఒకే లాంటి స్వీట్ కాకుండా.. ఈసారి కొత్తగా ట్రై చేయండి. ఇంట్లోనే ఇలా మలాయీ మాల్పువా ట్రై చేయండి. ఇది ఎంతో స్వీట్‌గా, రుచిగా ఉంటుంది. సాఫ్ట్‌గా అలా నోట్లో వేస్తే కరిగిపోతాయి. ఈ సారి మీ బ్రదర్ కోసం వెరైటీగా ఈ స్వీట్ తయారు చేయండి.

Malai Malpua: జన్మాష్టమి రోజున ఈ మలాయీ మాల్పువా చేయండి.. అదిరిపోతుంది..
Malai Malpua
Chinni Enni
| Edited By: |

Updated on: Aug 26, 2024 | 3:59 PM

Share

జన్మాష్టమి రోజున ప్రత్యేకమైన స్వీట్ ఉండాలి. ఎప్పుడూ ఒకే లాంటి స్వీట్ కాకుండా.. ఈసారి కొత్తగా ట్రై చేయండి. ఇంట్లోనే ఇలా మలాయీ మాల్పువా ట్రై చేయండి. ఇది ఎంతో స్వీట్‌గా, రుచిగా ఉంటుంది. సాఫ్ట్‌గా అలా నోట్లో వేస్తే కరిగిపోతాయి. ఈ సారి మీ బ్రదర్ కోసం వెరైటీగా ఈ స్వీట్ తయారు చేయండి. ఖచ్చితంగా నచ్చుతాయి. మరి ఈ స్వీట్ ఎలా తయారు చేస్తారు? ఈ స్వీట్ తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మలాయీ మాల్పువాకి కావాల్సిన పదార్థాలు:

మైదా, పంచదార, కోవా, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, పాలు, కుంకుమ పువ్వు, రోజ్ వాటర్, బేకింగ్ సోడా, పెరుగు.

మలాయీ మాల్పువా తయారీ విధానం:

ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. ఇందులో కొద్దిగా మైదా, బేకింగ్ సోడా, పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కోవా, పెరుగు కూడా వేసి కలుపుకోవాలి. కోవాకు బదులు పాల పొడి కూడా ఉపయోగించవచ్చు. పెరుగు పుల్లగా లేకుండా చూసుకోండి. కావాలంటే కొద్దిగా నీళ్లు వేసుకుంటూ.. పిండిని మరీ గట్టిగా కాకుండా.. పల్చగా కాకుండా కలపాలి. ఈ పిండిని ఓ అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి.. అందులో పంచదార, నీళ్లు వేసి పాకం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని.. అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఈ నెయ్యిలో పిండిని ఒక్కో గరిట వేసుకుంటూ ఉండాలి. ఇవి కాస్త రంగులోకి మారగానే వెనక్కి తిప్పాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా వేయించాక.. తీసి పంచదార పాకంలో వేసుకోవాలి.

ఇప్పుడు రబ్డీ తయారు చేసుకోవాలి. పాలను మదంగా ఉండే పాత్రలో వేసి మరిగించుకోవాలి. పాలు చిక్కగా అయ్యాక.. పంచదార, కుంకుమ పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇది చిక్కగా అయ్యాక ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ వేసి కలిపి దించాలి. ఇప్పుడు వీటిని రబ్డీని సర్వింగ్ ప్లేట్ లేదా గిన్నెలో వేసి ఆ తర్వాత ఇందులో పాకం మాల్పూవాలు వేసి ఓ ఐదు నిమిషాలు ఉంచి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మలాయీ మాల్పూవాలు సిద్ధం.

Follow Us
చేతుల్లో ఈ మార్పులు ఉన్నాయా? బాడీ వార్నింగ్ ఇస్తోందేమో!
చేతుల్లో ఈ మార్పులు ఉన్నాయా? బాడీ వార్నింగ్ ఇస్తోందేమో!
షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!
షుగర్ పెరగకుండా ఉండాలంటే.. ఈ పానీయాలపై ఓ లుక్కేయండి!
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!