AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పురుషులకు వరం ఖర్జూరాలు.. డైలీ ఇలా చేస్తే రోమాన్స్ లైఫ్‌కు తిరుగుండదంట..

ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.. మీరు రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే లేదా పని చేస్తున్నప్పుడు త్వరగా అలసిపోతే.. ఖచ్చితంగా మీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చుకోండి. ఇందులో మంచి మొత్తంలో ఐరన్, ఫైబర్ ఉంటాయి.

పురుషులకు వరం ఖర్జూరాలు.. డైలీ ఇలా చేస్తే రోమాన్స్ లైఫ్‌కు తిరుగుండదంట..
Dates Benefits
Shaik Madar Saheb
|

Updated on: Aug 25, 2024 | 7:16 PM

Share

ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.. మీరు రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే లేదా పని చేస్తున్నప్పుడు త్వరగా అలసిపోతే.. ఖచ్చితంగా మీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చుకోండి. ఇందులో మంచి మొత్తంలో ఐరన్, ఫైబర్ ఉంటాయి. ఖర్జూరాలను ఖాళీ కడుపుతో తినడం వల్ల అందులో ఉండే పోషకాలను శరీరం బాగా గ్రహిస్తుందని, దీనిద్వారా శరీరానికి శక్తి లభిస్తుందని చాలా మంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఖర్జూరం చాలా రుచిగా ఉంటుంది.. ఇది పురుషుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని.. లైంగిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మనం రోజూ ఎన్ని ఖర్జూరాలు తినాలి?

ఖర్జూరంలో సహజ చక్కెర ఉంటుంది.. ఇది ఆరోగ్యానికి హాని కలిగించదు. చాలా మందికి స్వీట్లు పదే పదే తినాలని భావిస్తారు.. అటువంటి పరిస్థితిలో ఖర్జూరం తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. పోషకాహార నిపుణుల ప్రకారం.. పురుషుల, మహిళలు ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా కనీసం 2 నుంచి 4 ఖర్జూరాలు తినడం చాలా మంచిది.. దీంతో శరీరంలో శక్తికి లోటు ఉండదు..

ఖర్జూరం ఖాళీ కడుపుతో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

రక్తహీనత దూరమవుతుంది: ఖర్జూరం శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడం ద్వారా రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కడుపు సమస్యలు దూరమవుతాయి: ఖర్జూరం ఫైబర్ కు గొప్ప మూలం.. ఇది ప్రేగు కదలిక ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్తి సమస్యను దూరం చేస్తుంది.

బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది: ఖర్జూరం తినడం వల్ల ఆకలి తగ్గుతుంది.. ఇంకా అతిగా తినడాన్ని నివారిస్తుంది. కాబట్టి, బరువు నియంత్రణ ప్రారంభమవుతుంది.

రక్త సరఫరాలో అంతరాయం ఉండదు: ఖర్జూరంలో ఉండే ఐరన్ శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఖర్జూరంలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.. ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది..

పురుషులకు ఖర్జూరాలు ఎందుకు మేలు చేస్తాయి?

ఖర్జూరాన్ని ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఖర్జూరం, పాలు కలిపి తీసుకోవడం వల్ల పురుషులలో సంతానోత్పత్తి పెరుగుతుంది. ఇంకా లైంగిక సమస్యలను దూరం చేస్తుంది.. శక్తిని పెంచుతుంది..

పాలలో రెండు లేదా మూడు ఖర్జూరాలను వేసి వేడి చేసి రోజూ తాగడం వల్ల వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. రోమాన్స్ లైఫ్ ను ఆనందకరంగా చేయడంలో సహాయపడుతుంది..

అంతే కాదు ఇందులో ఉండే మెగ్నీషియం మీ శరీరంలోని షుగర్‌ని నియంత్రిస్తుంది.. దీని వల్ల మధుమేహం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
ఈ సినిమా చాలా స్పెషల్‌గా అనిపించింది: పీవీ సింధు
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
వంటగదిలో ఉండే ఈ పదార్దాలతో.. ములక్కాయలు పిచ్చిపిచ్చిగా కాస్తాయి..
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
ప్రయాణికులకు అలర్ట్.. కన్ఫర్మ్ టికెట్ రద్దుపై కొత్త నిబంధనలు
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
37 సిక్సర్లు, 43 ఫోర్లతో 549 పరుగులు.. వీడియో చూస్తారా?
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
హీల్‌ ప్యారడైజ్‌లో ఇంటర్ ప్రవేశాలకు 2026 నోటిఫికేషన్‌ విడుదల
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
తిరుమలలో హీరోయిన్ శ్రీలీల తళుక్కుమన్నారు.. భక్తులతో ముచ్చట్లు
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
మైనర్ బాలికను గొంతు కోసి చంపిన యువకులు..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రివ్యూ.. ఐడియా అదిరిపోయింది కానీ..!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
హర్మూజ్ నుంచి ఇండియా‌కు షిప్ ఎన్ని రోజుల్లో చేరుతుందో తెలుసా!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!
విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది!