Sabudana Pulihora: సగ్గుబియ్యంతో ఇలా బ్రేక్ ఫాస్ట్ ట్రై చేయండి.. టేస్ట్ వేరే లెవల్..

సగ్గుబియ్యాన్ని మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సగ్గుబియ్యం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. శరీరానికి చాలా చలువ చేస్తుంది. సగ్గుబియ్యంతో కేవసం పాయసం మాత్రమే కాకుండా.. ఇంకా ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. వాటిల్లో సగ్గుబియ్యం పులిహోర కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా సగ్గుబియ్యం తినడం ఆరోగ్యం కూడా. కాబట్టి అస్సలు మిస్ చేయకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా త్వరగా పూర్తి..

Sabudana Pulihora: సగ్గుబియ్యంతో ఇలా బ్రేక్ ఫాస్ట్ ట్రై చేయండి.. టేస్ట్ వేరే లెవల్..
Sabudana Kichidi
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: May 13, 2024 | 10:11 AM

సగ్గుబియ్యాన్ని మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సగ్గుబియ్యం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. శరీరానికి చాలా చలువ చేస్తుంది. సగ్గుబియ్యంతో కేవసం పాయసం మాత్రమే కాకుండా.. ఇంకా ఎన్నో రకాల రెసిపీలు తయారు చేసుకోవచ్చు. వాటిల్లో సగ్గుబియ్యం పులిహోర కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా సగ్గుబియ్యం తినడం ఆరోగ్యం కూడా. కాబట్టి అస్సలు మిస్ చేయకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా త్వరగా పూర్తి అవుతుంది. వెరైటీగా తినాలి అనుకునేవారు దీన్ని ట్రై చేయండి. మరి ఈ సగ్గుబియ్యం పులిహోర ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

సగ్గు బియ్యం పులిహోరకు కావాల్సిన పదార్థాలు:

సగ్గుబియ్యం, ఉడికించిన బంగాళ దుంపలు, వేరు శనగ, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పచ్చి శనగ పప్పు, ఆవాలు, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తి మీర, ఉప్పు, పంచదార, నిమ్మరసం, ఆయిల్.

సగ్గు బియ్యం పులిహోర తయారీ విధానం:

ముందుగా సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి.. గిన్నెలోకి తీసుకుని నానబెట్టాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఇందులో ఆయిల్ వేసి.. వేరుశనగ వేసి వేయించాలి. ఆ తర్వాత తాలింపులు కరివేపాకు వేసి వేగాక.. పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఓ నిమిషం వేయించాలి. నెక్ట్స్ ఉప్పు, పంచదార, ఉడికించిన బంగాళ దుంప ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు వేయించాక.. కొద్దిగా పసుపు వేయాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి బాగా కలుపు కోవాలి. చివరగా దించే ముందు కొత్తిమీర, నిమ్మరసం పిండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే సగ్గుబియ్యం పులిహోర సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. అందులో ఆరోగ్యం కూడా. కాబట్టి మిస్ చేయకండి. దీన్ని స్నాక్ లా కూడా తినవచ్చు.