Viral Video: బ్లాక్‌ జిలేబీ అంటూ స్పెషల్ స్వీట్‌ తయారు చేసిన వ్యక్తి.. నీ బొందలా ఉందంటూ నెటిజన్ల ఫైర్! ఇంతకీ సంగతేమంటే

వంటల విషయంలో భారతీయుల స్టైలే వేరు. ఎంతో రుచిగా ఆహారాన్ని తయారు చేయడంలో భారతీయులది అందె వేసిన చేయి. కొన్ని ప్రత్యేక వంటకాలు మన వాళ్లు చేసినట్లు మరెవరూ చేయలేరంటే అతిశయోక్తి కాదు. గులాబ్ జామూన్ నుంచి హల్వా వరకు పులిహోర నుంచి బిర్యానీ వరకు ఎన్నో రకాల పిండి వంటకాలు, ఆహారాలు ఎంతో రుచిగా తయారు చేస్తుంటారు. స్వీట్లలో జిలేబీకి ప్రత్యేక స్థానం ఉంది. చక్కెర జిలేబీ, బెల్లం జిలేబీలను..

Viral Video: బ్లాక్‌ జిలేబీ అంటూ స్పెషల్ స్వీట్‌ తయారు చేసిన వ్యక్తి.. నీ బొందలా ఉందంటూ నెటిజన్ల ఫైర్! ఇంతకీ సంగతేమంటే
Black Jalebi Making
Follow us
Srilakshmi C

|

Updated on: May 13, 2024 | 11:33 AM

వంటల విషయంలో భారతీయుల స్టైలే వేరు. ఎంతో రుచిగా ఆహారాన్ని తయారు చేయడంలో భారతీయులది అందె వేసిన చేయి. కొన్ని ప్రత్యేక వంటకాలు మన వాళ్లు చేసినట్లు మరెవరూ చేయలేరంటే అతిశయోక్తి కాదు. గులాబ్ జామూన్ నుంచి హల్వా వరకు పులిహోర నుంచి బిర్యానీ వరకు ఎన్నో రకాల పిండి వంటకాలు, ఆహారాలు ఎంతో రుచిగా తయారు చేస్తుంటారు. ఇక స్వీట్లలో జిలేబీకి ప్రత్యేక స్థానం ఉంది. చక్కెర జిలేబీ, బెల్లం జిలేబీలను లొట్టలేసుకుంటూ తినేస్తుంటారు. అయితే మీరెప్పుడైన ‘నల్ల జిలేబీ’ తిన్నారా? కనీసం చూశారా? తాజాగా ఈ బ్లాక్‌ జిలేబీకి చెందిన వీడియో ఒకటి నెట్టింట వైలర్‌ అవుతోంది.

ఈ వీడియోలో జిలేబీ తయారీ విధానం సాధారణంగా అనిపించినప్పటికీ దాని ఆకారం, రంగులో మాత్రం కొంత వ్యత్యాసం కనిపిస్తుంది. వీడియోలో ఓ వ్యాపారస్తుడు వేడి నూనె పాత్రలో బిలేజీ ఆకారంలో పిండిని ఒత్తుతాడు. సాధారణంగా జిలేబీ పిండిని నూనెలో వేయగానే లేత ఎరుపురంగులోకి మారుతుంది. కానీ ఈ వీడియోలో మాత్రం జిలేబీ పిండి గుండ్రంగా ఉబ్బడమేకాకుండా నలుపురంగులోకి మారడం చూడొచ్చు. అనంతరం నలుపు రంగులోకి మారిన జిలేబీని పక్కనేఉన్న చక్కెర పాకంలో ముంచుతాడు. తర్వాత వాటిని తీసి ఓ పాత్రలో వేస్తాడు. అవి చూసేందుకు నల్లగా బొగ్గుల మాదిరి ఉంటాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు వ్యాపారిపై మండి పడుతున్నారు. ‘ఇది బ్లాక్‌ జిలేబీ కాదురా.. అది నల్లగా మాడిపోయింది’ అంటూ అధిక మంది నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. పిండిని నల్లగా మాడిపోయేదాకా నూనెలో వేయించి.. బ్లాక్‌ జిలేబీ అంటూ మోసం చేస్తున్నాడంటూ ఒకరు, ఇది పనీర్ జలేబీ అని మరొకరు, ‘ఇది బ్లాక్‌ జిలేబీ కాదు. ఎక్కువగా వేయించడం వల్ల నల్లగా మాడిపోయింది’ అంటూ ఇంకొకరూ కామెంట్‌ సెక్షన్‌లో పేర్కొన్నారు. ‘నేను ముందే అనుకున్నాను. ఇది మామూలు జిలేబీ కాదని. ఇది మావా జలేబి’ అంటూ మరో నెటిజన్‌ తానేదో కొత్త విషయాన్ని కనుగొన్నట్లు ధృవీకరించాడు. దీంతో అసలు ఇది మాడిన జిలేబా.. లేదా ఏదైనా కొత్త స్వీటా అంటూ తెగ చర్చిస్తున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

కాగా సోషల్‌ మీడియాలో ఇలా జిలేబీ చర్చకు దారితీయడం ఇదేం తొలిసారి కాదు. గతంలో బంగ్లాదేశ్‌లో భారీ సన్‌ఫ్లవర్ జిలేబీని ఓ వ్యక్తి తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది చూసేందుకు చపాతీ సైజులో ఉండటంతో కాస్త సుధీర్ఘంగానే దీనిపై చర్చలు జరిగాయి. ఇంతకీ మీరేం అంటారు. అది మాడిన జిలేబా..? బ్లాక్‌ జిలేబా?

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి.