ఆడు మగాడ్రా బుజ్జీ.! సొంత పెళ్లాం దగ్గరే డబ్బులు వసూలు చేస్తూ.. తెగ ఎంజాయ్ చేసేస్తున్నాడుగా..

ఏ వ్యక్తి అయినా.. తాను గొప్పగా ఉండాలని.. జీవితం ఎంతో ఉన్నతంగా ఉండాలని.. తన భార్యను సంతోషకరంగా చూసుకోవాలని కోరుకుంటూ ఉంటాడు. భర్త ధనవంతుడైతే.. కచ్చితంగా తన భార్య ప్రతీ డిమాండ్ తప్పనిసరిగా నెరవేర్చుతుంటాడు. ఇలాంటి వార్తలు తాము తరచూ చూస్తూనే ఉంటాం.

ఆడు మగాడ్రా బుజ్జీ.! సొంత పెళ్లాం దగ్గరే డబ్బులు వసూలు చేస్తూ.. తెగ ఎంజాయ్ చేసేస్తున్నాడుగా..
Representative Image
Follow us
Ravi Kiran

|

Updated on: May 13, 2024 | 11:09 AM

ఏ వ్యక్తి అయినా.. తాను గొప్పగా ఉండాలని.. జీవితం ఎంతో ఉన్నతంగా ఉండాలని.. తన భార్యను సంతోషకరంగా చూసుకోవాలని కోరుకుంటూ ఉంటాడు. భర్త ధనవంతుడైతే.. కచ్చితంగా తన భార్య ప్రతీ డిమాండ్ తప్పనిసరిగా నెరవేర్చుతుంటాడు. ఇలాంటి వార్తలు తాము తరచూ చూస్తూనే ఉంటాం. అయితే మీకో వార్త చెప్పాలి. భర్త ఎంతటి ధనవంతుడైనా.. ఓ భార్య మాత్రం చాలా కష్టాలు పడుతోంది. తన భర్త తన కోరికలు ఏవీ తీర్చడం లేదని, అంతేకాకుండా తన ఇంట్లో నివాసముంటున్నందుకు అద్దె కట్టాలని చెప్పినట్టుగా ఆ మహిళ తన బాధను సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. అంతే కాకుండా ఆమె చేసిన చిన్న చిన్న పనులకు కూడా అతడు ఎలాంటి బిల్లులు చెల్లించడం లేదని చెప్పింది. తన భర్త చేస్తోన్న ఈ వింత ప్రవర్తనకు తీవ్ర అసహనానికి గురైన ఆ మహిళ.. తన గోడును నెటిజన్లతో పంచుకుంది.

వివరాల్లోకెళ్తే.. ఓరిగామి టోర్బీ అనే మహిళ.. ఓ ధనవంతుడ్ని పెళ్లి చేసుకుంది. తన జీవితమంతా సంతోషంగా ఉంటుందని భావించింది. అయితే ఆమె కలలన్ని ఆవిరైపోయాయి. తన చిన్న ఖర్చులు తానే భరిస్తోంది. ప్రతీ రోజూ ఉద్యోగానికి వెళ్లి వేస్తోంది. పెళ్లయి 18 సంవత్సరాలు అయినప్పటికీ.. భర్త ఆమెకు ఒక్క రూపాయి కూడా ఖర్చుకు ఇవ్వలేదట. అతడు ఉద్యోగం నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నాడు. అనంతరం వచ్చిన డబ్బుతో తెగ ఎంజాయ్ చేస్తున్నాడని.. అలాగే అతడి అభిరుచులన్నీ కూడా నెరవేర్చుకుంటున్నాడని సదరు మహిళ పేర్కొంది. ఇలా అంతా కూడా తన ఆనందం గురించి పట్టుకునే అతడు.. ఎప్పుడూ ఆమెను పట్టించుకోలేదట. పైగా తన ఇంట్లో ఉంటున్నందుకు 17 ఏళ్లుగా అద్దె కూడా కట్టించుకుంటున్నాడట. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.